Afghan Taliban : అప్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలతో అక్కడ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. గత ఏడాది అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన మొదలైంది. అప్పటి నుంచి ప్రజలపై అనేక ఆంక్షలు విధించింది. ఇటీవల ఉద్యోగులు ఆఫీసులకు గడ్డంతోనే రావాలని, వదులుగా ఉండే దేశీయ దుస్తులనే వేసుకోవాలని, అప్ఘాన్ ప్రజలకు ముఖ్యమైన ఉపాధి, ఆదాయ వనరుగా ఉన్న ఓపియం సాగుపై నిషేధం, పాఠశాలలు, యూనివర్సిటీల్లో కో ఎడ్యుకేషన్‌ను నిషేధం,మహిళలు మగ తోడు లేకుండా విమానాల్లో ప్రయాణించకూడదు వంటి నిబంధనలు విధించిన తాలిబన్ సర్కార్..ఇప్పుడు యువత చెడిపోతున్నారంటూ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అప్ఘాన్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాయనే కారణంతో టిక్‌టాక్, పబ్జీలను అప్ఘాన్ లో బ్యాన్ చేసింది తాలిబన్ ప్రభుత్వం. నిషేధించారు. అప్ఘానిస్తాన్ లో ఇప్పటికే సంగీతం, సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలపై నిషేధం ఉంది. దాంతో అక్కడి ప్రజలు వినోదం కోసం మొబైల్స్ లో కొన్ని వీడియో గేమ్స్, మరికొన్ని ఫోన్ అప్లికేషన్‌లపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు వాటిపై కూడా తాలిబన్లు కొత్త రూల్స్ పెట్టడంతో యువత తమలో తామే ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా వార్తలు, మతపరమైన కార్యక్రమాలు తప్ప ఇంకేం ప్రసారం చేయకూడదని టెలికాం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ముఖ్యంగా అనైతిక విషయాలను ప్రసారం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించింది. ఇక,ప్రజలకు స్వేచ్ఛనిస్తామని, మహిళలను గౌరవిస్తామంటూ చెప్పుకొచ్చిన తాలిబన్లు తమ పాలనలో పాత పద్ధతినే అవలంబిస్తున్నారు. దాంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కానీ తాలిబన్లు తమ విధివిధానాలను మార్చుకోవడం లేదు. పైగా వింత వింత నిబంధనలు పెట్టి ప్రజలను మరింత ఇబ్బందులు పెడుతున్నారు.
త
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, PUBG, Taliban, Tiktok