వీళ్లు సూపర్.. ఈ ప్లేస్‌లో కూడా వ్యాక్సిన్ సెంటర్ పెట్టొచ్చని నిరూపించారు..

టిక్ టాక్ స్టూడియోలో వ్యాక్సిన్ సెంటర్ (Image: Reuters)

ఆరోగ్య కార్యకర్తలే ప్రజల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మాస్ వ్యాక్సినేషన్​ కార్యక్రమాలను చేపడుతున్నాయి. కేవలం ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనే కాకుండా ప్రజలు ఎక్కువగా గుమికూడే బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి.

  • Share this:
యావత్​ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడికి చేయడానికి ఏకైక మార్గంగా భావిస్తున్న వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే, టీకాలపై ఉన్న అసత్య ప్రచారం, అనుమానాల మధ్య చాలా మంది ముందుకు రావడం లేదు. దీంతో, ఆరోగ్య కార్యకర్తలే ప్రజల వద్దకు వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మాస్ వ్యాక్సినేషన్​ కార్యక్రమాలను చేపడుతున్నాయి. కేవలం ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోనే కాకుండా ప్రజలు ఎక్కువగా గుమికూడే బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. అంతేకాదు, వాక్సినేషన్​ను ప్రోత్సహించేందుకు కొన్ని ప్రభుత్వాలు ఉచిత బీర్, ఫుడ్​, షాపింగ్​ టోకెన్లు ఇస్తున్నాయి. ఇక, భారత్​లో అయితే కొన్ని ప్రదేశాల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్ వంటి కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇవి మంచి ఫలితాలిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న కొన్ని అసాధారణ వాక్సిన్​ కేంద్రాలను పరిశీలిద్దాం.

షాపింగ్ మాల్​లో వ్యాక్సిన్​
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో పారాగాన్ షాపింగ్ మాల్‌లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ చేపట్టారు. జనాలు ఎక్కువగా ఉండే ఈ షాపింగ్​ మాల్​ దగ్గర మాస్​ వ్యాక్సినేషన్​ ప్రక్రియ చేపట్టారు. ఇక్కడ ఆస్ట్రాజెనెకా వాక్సిన్​ వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్​ కేంద్రానికి అనూహ్య స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు.

సినిమా థియేటర్​లో వాక్సిన్​
ఫిలిప్పీన్స్‌లోని ఒక సినిమా థియేటర్​లో కూడా వాక్సిన్​ ఇస్తున్నారు. మెట్రో మనీలాలోని శాన్ జువాన్ సిటీలో ఉన్న సినిమా థియేటర్​లో ఈ వ్యాక్సినేషన్​ ప్రక్రియ చేపట్టారు.

టిక్‌టాక్ స్టూడియోలో వాక్సిన్​
కజకిస్థాన్‌ అల్మట్టిలోని మెగా పార్క్ మాల్‌ సమీపంలోని ఒక టిక్‌టాక్ స్టూడియోలో తాత్కాలిక వాక్సిన్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మహిళకు ప్రత్యేకంగా వ్యాక్సిన్​ వేస్తున్నారు. కజకిస్థాన్​ దేశీయంగా అభివృద్ధి చేసిన కజ్​కోవిడ్-ఇన్ వ్యాక్సిన్‌ లేదా కజ్​వాక్స్​తో పాటు రష్యన్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్, చైనా కరోనావాక్, హయత్-వాక్స్ వ్యాక్సిన్లను కూడా వేస్తున్నారు.

చర్చిలో వ్యాక్సిన్​
బ్రిటన్‌ సాలిస్‌బరీలోని చారిత్రాత్మక కేథడ్రాల్ చర్చి లోపల కరోనా వ్యాక్సిన్​ ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్​ సెంటర్​కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

బస్సుల్లో వాక్సిన్​
మెక్సికో దేశంలోని సియుడాడ్ జుయారెజ్ సిటీలో గల అసెంబ్లీ ఫ్యాక్టరీ ఉద్యోగులకు బస్సులోనే వ్యాక్సిన్​ వేస్తున్నారు. వారందరికీ ఫైజర్ -బయోఎంటెక్ వ్యాక్సిన్​ ఇస్తున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: