• Home
  • »
  • News
  • »
  • international
  • »
  • TAIWAN TRAIN ACCIDENT TRAIN DERAILED IN A TUNNEL LINE 48 DIED FEW INJURED IN TAIWAN SK

Taiwan Train Mishap: ఘోర రైలు ప్రమాదం.. సొరంగంలో పట్టాలు తప్పిన ట్రైన్.. 48 మంది మృతి

తైవాన్‌లో పట్టాలు తప్పిన రైలు

రైలు స్పీడ్‌గా వెళ్తున్న సమయంలో రైల్వే మెయింటెనెన్స్ ట్రక్ ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో.. ఆ ట్రక్కును ఢీకొట్టి రైలు పట్టాలు తప్పింది. సొరంగ మార్గానికి కొంత దూరంలో ట్రక్‌ను వేగంగా ఢీకొట్టి.. అనంతరం సొరంగంలోకి దూసుకెళ్లింది.

  • Share this:
    తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ సొరంగ మార్గంలో పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 48 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది. వంద మందికి పైగా గాయాలు అయినట్లు తెలిపింది. ప్రమాద సమయంలో రైలులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. తైవాన్‌లోని తైపీ నుంచి టైటాంగ్ వెళ్తుండగా.. హోలియన్ కౌంటీ సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రైలు స్పీడ్‌గా వెళ్తున్న సమయంలో రైల్వే మెయింటెనెన్స్ ట్రక్ ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో.. ఆ ట్రక్కును ఢీకొట్టి రైలు పట్టాలు తప్పింది. సొరంగ మార్గానికి కొంత దూరంలో ట్రక్‌ను వేగంగా ఢీకొట్టి.. అనంతరం సొరంగంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు బోగీలు తునాతునకలయ్యాయి. ప్రయాణికుల మృతదేహాలు చెల్లా చెదరుగా పడిపోయాయి.


    ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముక్కలు ముక్కలైన బోగీల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకా ఏవైనా మృతదేహాలు ఉన్నాయా? అని గాలిస్తున్నారు. అన్ని బోగీల కిటికీలను బద్దలు కొట్టి లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారేమోనని చూస్తున్నారు. తైవాన్‌లో ఇటీవల జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదం ఇదే. ప్రమాద సమయంలో రైలు పూర్తిగా నిండిపోయిందని.. జనాలు కిక్కిరిసి ఉన్నారని స్థానికులు తెలిపారు. గాయపడడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు. మృతుల సంఖ్య మరింతగా పెరగొచ్చని భావిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: