Home /News /international /

TAIWAN ROCKED BY STRONG EARTHQUAKE TREMORS SHAKE BUILDING METRO RAIL DISRUPTED MKS

Metro Rail కుప్పకూలుతుందని హడలిపోయాం -6.5 తీవ్రతతో భారీ భూకంపం -వణికిన నగరాలు

తైవాన్ లో భారీ భూకంపం

తైవాన్ లో భారీ భూకంపం

తూర్పు ఆసియా దేశం తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని తైపీ నగరంతోపాటు ఈశాన్యంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నాడు ప్రకంపలను చోటుచేసుకున్నాయి. తైపీలో మెట్రో రైల్ సర్వీసుల్ని నిలిపేశారు. పలు భవంతులకు పగుళ్లు ఏర్పడ్డాయి..

‘మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారే కుదుపులకు గురయ్యాం.. బోగీలు అటు ఇటు ఊగిపోయాయి.. తేరుకునేలోపే మరోసారి కుదుపులకు కిందికిమీదికయ్యాం.. మెట్రో రైలు కుప్పకూలి నేలమీద పడటం తథ్యమని అంతా భయపడిపోయాం. మరు నిమిషంలో రైలు దాదాపు ఆగిపోయింది. నెమ్మదిగా దగ్గర్లోని స్టేషన్ కు తీసుకెళ్లి మమ్మల్నందరినీ రైల్లో నుంచి దింపేశారు.. ’అంటూ కొద్ది సేపటి తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు టామ్ పార్కర్. ప్రస్తుతం అతను తైవాన్ రాజధాని తైపీలో నివసిస్తున్నాడు..

తూర్పు ఆసియా దేశం తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని తైపీ నగరంతోపాటు ఈశాన్యంలోని పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.11 గం. సమయంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.5గా నమోదయిందని తైవాన్‌ సెంట్రల్‌ వెదర్‌ బ్యూరో వెల్లడించింది. యూఎస్ జియాలజికల్ సర్వే వారు మాత్రం దీని తీవ్రత 6.2గా చెబుతున్నారు.

రెండుగా చీలిన BJP.. ఆ వర్గాలివే - రాష్ట్ర DGPపైనే CM KCR నిఘా : Revanth reddy


ఈశాన్య తైవాన్ లోని యిలాన్ సిటీలో.. భూమికి 67 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని తైవాన్ అధికారులు చెప్పారు. తైపీ సహా పలు నగరాల్లో భవంతులకు బీటలు ఏర్పడటం, సూపర్ మార్కెట్లలో సరుకులు కిందపడిపోవడం, ఇళ్లలో ఫ్యాన్లు ఊగటం లాంటి వీడియోలను జనం షేర్ చేశారు. భూకంపం కారణంగా తైవాన్ సిటీలో మెట్రో రైల్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.

Instagram : అమ్మాయి మోసం చేస్తే కుటుంబం కాపాడింది.. కానీ నవీన్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..


భూగర్భంలోని రెండు టెక్టానిక్ ప్లేట్లు కలిసే చోట ఉండటంతో తైవాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే, తీవ్రమైన భూకంపాల్లో ఆస్తి, ప్రాణనష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆదివారం నాటి భూకంపం ఏ మేరకు నష్టాన్ని మిగిల్చిందో తెలియాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:

Tags: Earthquake, Metro Train, Taiwan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు