Home /News /international /

TAEKWONDO DREAM TO STOP CHILD MARRIAGES IN ZIMBABWE AK GH

Taekwondo: టీనేజ్ టైక్వాండో ఛాంప్ డ్రీమ్ ఏంటో తెలుసా ?

తాను సాధించిన మెడల్స్ చూపిస్తున్న మరిస్టా (Source: AP)

తాను సాధించిన మెడల్స్ చూపిస్తున్న మరిస్టా (Source: AP)

వైవాహిక జీవితం లోతుపాతులు చర్చించేందుకు ఇదే సేఫ్ స్పేస్ అని మరిస్టా వద్ద టైక్వాండో నేర్చుకుంటున్నవారంతా చెబుతున్నారు. టీన్ మదర్స్ తో తమ సాధకబాధకాలు చెప్పిస్తే బాల్యవివాహాలకు చెక్ పెట్టచ్చనేది ఈమె ప్రయత్నం.

చిన్న అమ్మాయి.. తన ఈడు పిల్లలు పడుతున్న నరకం చూడలేక.. ఆ నరక కూపంలో కొత్తగా ఎవరూ కూరుకుపోకుండా తనవంతు కృషి చేస్తోంది. అంతేకాదు ఇప్పటికే బానిసల కంటే అధ్వానమైన బ్రతుకీడుస్తున్నవారిలో కొత్త ఆశలు రేకెత్తించేందుకు తనకు తెలిసిన విద్యను బోధిస్తోంది. జింబాబ్వేలో (Zimbabwe) 10 ఏళ్లలోపే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసే సంప్రదాయం చాలా ఎక్కువ. దీనికంతా ప్రధాన కారణం పేదరికం, అనాగరిక సంప్రదాయాలు. ఇక అమ్మాయికి పెళ్లి చేయాలంటే అబ్బాయి అందుకు కన్యాశుల్కం ఇవ్వాల్సిందే. అంటే అమ్మాయి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వాలి. ఇలా తమ కూతురిని పెళ్లి పేరుతో అమ్మితే వచ్చిన డబ్బుతో మిగతా కుటుంబమంతా బతుకుతుంది. కానీ చిన్న వయసుకే ఇలా పెళ్లైన చిన్నారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఆడుకుని, చదువుకునే వయసులో తల్లులై అనారోగ్యానికి బలైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పుట్టిపెరిగిన నట్సిరైషా మరిస్టా అనే అమ్మాయి ఈ అఘాయిత్యాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇంతా చేస్తే ఈ అమ్మాయి వయసు 17 ఏళ్లు కూడా దాటవు.

టైక్వాండో అస్త్రంగా పోరాటం
5 ఏళ్ల వయసు నుంచే టైక్వాండోపై ( taekwondo) ఆసక్తి కలగ్గా, టైక్వాండో ఛాంపియన్ గా నిలిచిన మరిస్టా ఇప్పుడు తనకు తెలిసిన టైక్వాండోను పిల్లలందరికీ నేర్పుతోంది. పెళ్లి కాని చిన్నారులు, పెళ్లైనవారు, చిన్న వయసులోనే తల్లులైన అమ్మాయిలకు టైక్వాండో నేర్పడం ద్వారా వారిలో సాధికారత వస్తుందని మరిస్టా భావిస్తోంది. ఇక క్లాస్ అయ్యాక వీరంతా కాసేపు పలు విషయాలపై చర్చిస్తారు. వాటిలో ప్రధానమైంది పెళ్లయ్యాక ఆ చిన్నారులు పడుతున్న మానసిక, శారీరక కష్టాలను వివరించి, మరెవ్వరికీ ఇలాంటివి జరగరాదని, బాల్య వివాహాలను రూపుమాపాలని చర్చిస్తారు. స్ట్రెచ్, కిక్, పంచ్, స్పార్ వంటివన్నీ చేసే క్రమంలో వీరు మానసికంగా పుంజుకుంటారని మరిస్టా వివరిస్తోంది. తమ వైవాహిక జీవితం లోతుపాతులు చర్చించేందుకు ఇదే సేఫ్ స్పేస్ అని మరిస్టా వద్ద టైక్వాండో నేర్చుకుంటున్నవారంతా చెబుతున్నారు. టీన్ మదర్స్ తో తమ సాధకబాధకాలు చెప్పిస్తే బాల్యవివాహాలకు చెక్ పెట్టచ్చనేది ఈమె ప్రయత్నం.

కోవిడ్ తెచ్చిన తంటా
దక్షిణాఫ్రికా దేశమైన జింబాబ్వేలో 18 ఏళ్లు వచ్చేవరకు వివాహం చేయరాదనే నిబంధన ఉన్నప్పటికీ కటిక పేదరికం కారణంగా 30శాతం మంది బాలికలకు 10 ఏళ్లు కూడా నిండకుండానే పెళ్లి చేసేసి తల్లిదండ్రులు చేతులు దులుపుకుంటున్నారు. కోవిడ్ మహమ్మారి (Covid pandemic) వీరి జీవితంలో మరింత దరిద్రం నింపింది. కోవిడ్ కారణంగా బాల్యవివాహాల (child marriage) సంఖ్య ఇక్కడ తారాస్థాయికి చేరింది.

కూతురికి మద్దతుగా..
కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగటంతో జింబాబ్వేలో లాక్ డౌన్ (lockdown) విధించగా జనసమ్మర్దనం నిషేధించారు. ఈకారణంగా ప్రస్తుతం మరిస్టా టైక్వాండో క్లాసులు నిర్వహించటం లేదు. కానీ లాక్ డౌన్ ఎత్తివేశాక తన కార్యక్రమాలను షరామామూలుగా కొనసాగించటానికి మరిస్టా రెడీగా ఉంది. మరిస్టా తండ్రి చిన్న రైతు కాగా తల్లి గృహిణి. అయినప్పటికీ తమ కుమార్తె ఆసక్తిని వారు ప్రోత్సహిస్తూ ఉండటం విశేషం. ఈ వివరాలన్నీ తెలిసాక ఈ ఫొటోలోని మరిస్టాను చూస్తే.. వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలుపెడదాం.. అన్న నానుడి గుర్తొచ్చి తీరుతుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Zimbabwe

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు