Home /News /international /

TABIBAN CONTINUE ATTACKS ON THREE MAJOR CITIES IN AFGHANISTAN NGS

Taliban Hideouts Destroyed: తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ దళాల దాడులు.. 250 మంది తాలిబన్ల హతం..

ఆఫ్ఘన్ భద్రతాదళాల దాడుల్లో 250 మంది తాలిబన్లు హతం

ఆఫ్ఘన్ భద్రతాదళాల దాడుల్లో 250 మంది తాలిబన్లు హతం

ఆప్ఘన్ భద్రతా దళాలు వైమానిక దళాలు విరుచుకుపడ్డాయి. తాలిబన్ స్థావరాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడుల్లో 250 మందికిపైగా హతమయ్యారు.. మరో 100 మందికిపైగా గాయాలైనట్టు ఆ దేశ ప్రభుత్వమే ప్రకటించింది..

    Taliban Hideouts Destroyed: ఆఫ్ఘన్ భద్రతా దళాలు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మాటు వేసి మరీ తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ దళాలు వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ ప్రావిన్స్ లోని జేరాయ్ జిల్లాలో మొదట తాలిబన్లు ఉంటున్న స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా తదితర రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై కూడా జరిపిన ఈ దాడుల్లో 250 మందికి పైగా తాలిబన్లు మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. తమ దాడుల్లో వందలాది మంది తాలిబన్లు మరణించడమో..గాయపడడమో జరిగిందని మొదట చేసిన ట్వీట్ లో పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరణ ప్రారంభం కావడంతో తాలిబన్లు వరుసగా దేశంలోని అనేక జిల్లాలను, గ్రామాలను తమ హస్తగతం చేసుకుంటూ వచ్చారు. కాందహార్ విమానాశ్రయంపై రాకెట్లు కూడా ప్రయోగించారు. ఇన్నాళ్లూ కేవలం వారిని వార్ జోన్ లో ఎదుర్కొన్న ఆఫ్ఘన్ బలగాలు ఏకంగా వైమానిక దాడులకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    తమ ఈ ఎటాక్ లో ధ్వంసమైన తాలిబన్ల స్థావరాల తాలూకు వీడియోను కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. గత 24 గంటల్లో తాము జరిపిన ఈ దాడుల్లో కచ్చితంగా ఎంతమంది మృతి చెందింది, ఎంతమంది గాయపడింది కూడా వివరించింది. ఈ వైమానిక దాడులను ఏ మాత్రం ఊహించని తాలిబన్లు భారీగా నష్టపోయారని అంటున్నారు. త్వరలో తాము ఈ తరహా ఎటాక్ లకు పాల్పడుతామని ఆఫ్ఘన్ ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది.http://



    కాందహార్ ఎయిర్ పోర్టుపై వారు రాకెట్లను ప్రయోగించడంతో ఇక ఉపేక్షించరాదని ప్రభుత్వం భావించినట్టు కనబడుతోంది.కాగా తాలిబన్ల దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. ఊహించని దాడితో తప్పించుకోలేకపోయిన తాలిబన్లు.. ఏ క్షణానైనా విరుచుకు పడే అవకాశం ఉండడంతో.. ఆప్ఘన్ భద్రతా దళాలు ముందే అప్రమత్తమయ్యాయి. ఈ దాడులకు ఇప్పట్లో విరామం ఇవ్వమని.. పూర్తిగా తాలిబన్ స్థావరాలను ధ్వంసం చేసే వరకు ఆగేది లేదని స్పష్టం చేస్తోంది ఆప్ఘన్ ప్రభుత్వం.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Afghanistan, International news, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు