ISIS leader killed 2022: అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి సిరియా (Syria) లో జరిపిన మెరుపుదాడిలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ (Abu Ibrahim al-Hashimi al-Qurayshi ) హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden) తన ట్విట్టర్ (Twitter) అధికారిక ఖాతాలో వెల్లడించారు. రెబెల్స్ అధీనంలోని వాయవ్య ఇద్లిబ్ ప్రావిన్సులో ఖురేషీ దాగున్న రెండంతస్తుల ఇంటిపై ప్రత్యేక దళాలు దాడి చేశాయి. ఐఎస్ సాయుధులకు, వారికి రెండు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగినట్టు సమాచారం. అయితే చివరికి ఇంటిని సైన్యం చుట్టుముట్టడంతో ఖురేషీ ఏమీ చేయలేక బాంబు పేల్చుకుని కుటుంబంతో సహా చనిపోయినట్టు యూఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలతో పాటు కనీసం 13 మంది మరణించినట్టు సమాచారం. మృతదేహాలు తునాతునకలయ్యాయని, బాంబు దాడుల్లో ఇల్లు నేలమట్టమైందని చెబుతున్నారు.
ఈ ఆపరేషన్ విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి తమ సైనికులంతా క్షేమంగా తిరిగొచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ ఘటన ఒబామా స్టైల్‌ను గుర్తు చేస్తుందని అంతర్జాతీయ రాజకీయ వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 2011లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిన్ లాడ్‌ను హతమార్చారు. ఈ ఆపరేషన్‌ను ఒబామా స్వయంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్‌లో దాక్కొన్న లాడెన్‌ను పాకిస్థాన్ ప్రభుత్వానికి తెలియకుండానే వెళ్లి హతమార్చి వచ్చారు. ఈ ఘటన ఒబామా (Obama) ఇమేజ్‌ను అమాంతం పెచ్చేసింది.
Last night at my direction, U.S. military forces successfully undertook a counterterrorism operation. Thanks to the bravery of our Armed Forces, we have removed from the battlefield Abu Ibrahim al-Hashimi al-Qurayshi — the leader of ISIS.
https://t.co/lsYQHE9lR9
— President Biden (@POTUS) February 3, 2022
Uttar Pradesh Elections: ఆ స్థానాల్లో బీజేపీకి గట్టిపోటీ.. ఎస్పీ అవకాశాన్ని వినియోగించుకొంటుందా?
తాజాగా బైడెన్ కూడా అదే బాట పట్టినట్టు మేధావి వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఉగ్రవాదుల ఏరివేతతో అంతర్జాతీయ సమాజానికి మంచి చేస్తున్నామని, అమెరికాను రక్షిస్తున్నామనే ఇమేజ్‌ను సొంతం చేసుకొంటున్నారనే వాదన వస్తుంది. 2019 అక్టోబర్‌లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) ఉన్నప్పుడు కూడా ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ కూడా ఇదే ఇద్లిబ్ ప్రాంతంలో యూ ఎస్ దళాలు చుట్టుముట్టడంతో ఇలాగే బాం బు పేల్చు కుని చనిపోయాడు.
అమెరికా అధ్యక్షులుగా ఎవరున్నా.. ఈ స్టైల్ దాడులు సహజంగా ఉంటున్నాయని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. ఈ దాడులు వారికి ఎన్నికల్లోనూ ఉపయోగపడుతున్నాయి.
లాడెన్ హతం ఒబామాకు మంచి మైలేజ్ ఇచ్చిందని గుర్తు చేసుకొంటున్నారు. ట్రంప్ కూడా అదే బాటా పట్టే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు బైడెన్‌కు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్) చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ హతమార్చడం ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
ఏదైమైనా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐఎస్)కు అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ హతం పెద్ద దెబ్బే. ఇక ఇప్పట్లో త్వరగా కోలుకొనే అవకాశం లేదని చెబుతున్నారు. ఉగ్రవాదులను అంతమొందించడంలో అమెరిక కృత నిశ్చయంతో ఉందని వైట్ హౌస్ వర్గాలు చెప్పకనే చెబుతున్నాయని అమెరికన్ మీడియా వార్తలు ప్రసారం చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Barack Obama, Donald trump, ISIS, Joe Biden