Free Wi-Fi: పిల్లలకు ఆ పేరు పెడితే ఉచితంగా ఇంటర్నెట్.. స్విస్ కంపెనీ బంపరాఫర్

స్విట్జర్లాండ్ కు చెందిన ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థ తల్లిదండ్రులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీ పేరును నవజాత శిశువుకు పెడితే.. వారికి 18ఏళ్లు ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

news18
Updated: October 19, 2020, 3:07 PM IST
Free Wi-Fi: పిల్లలకు ఆ పేరు పెడితే ఉచితంగా ఇంటర్నెట్.. స్విస్ కంపెనీ బంపరాఫర్
File image
  • News18
  • Last Updated: October 19, 2020, 3:07 PM IST
  • Share this:
కొంతమంది ఆఫర్ల కోసమే షాపింగ్ చేస్తుంటారు. మరికొంత మంది ఫ్రీగా లభించే బెనిఫిట్స్ కోసం వస్తువులు కొంటారు. అదనపు ప్రయోజనాలను కొన్ని సంస్థలు కూడా సొమ్ము చేసుకుంటాయి. ఇలాంటి ఆఫర్లకు సంబంధించిన ఒక విచిత్రమైన సంఘటన స్విట్జర్లాండ్ లో జరిగింది. ఒక ఒక ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థ తల్లిదండ్రులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ కంపెనీ పేరును నవజాత శిశువుకు పెడితే.. వారికి 18ఏళ్లు ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. పేరు వెల్లడించడానికి అంగీకరించని ఓ స్విస్ జంట ఈ ఆఫర్ను ఎంచుకుంది.

ప్రకటనలు ఇచ్చిన కంపెనీ

స్విస్ ఇంటర్నెట్ సంస్థ Twifi ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఆసక్తి గల తల్లిదండ్రులు తమ శిశువుకు కంపెనీ పేరు పెడితే ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామని తెలిపింది. దీంతో ఆ బిడ్డ తండ్రి ఫేస్బుక్ లో తమ అంగీకారాన్ని తెలిపారు. Twifi ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీ పేరును వారు తమ బిడ్డకు పెట్టారు. ఇందుకు సదరు సంస్థ వారికి 18 సంవత్సరాలు ఉచితంగా వైఫై సేవలను అందించనుంది. దీనికి సంబంధించిన వివరాలను అక్కడి వార్తాసంస్థలు ప్రచురించాయి.

ఆ పేర్లు పెట్టమన్నారు
నవజాత శిశువులకు Twifius లేదా Twifia అని పేరు పెట్టాలని ఆ సంస్థ నిబంధనలు విధించింది. ఆసక్తిగల తల్లిదండ్రులు పిల్లల బర్త్ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలని తెలిపింది. వెరిఫికేషన్ తరువాత కంపెనీ నుంచి 18 సంవత్సరాల ఉచిత ఇంటర్నెట్ ను అందిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ ను అందిపుచుకున్న స్విస్ జంట తమ కుమార్తెకు Twifia అనే పేరు పెట్టింది. తమ వివరాలను వారు బయటపెట్టలేదు. ఇంటర్నెట్ సదుపాయం కోసం ఖర్చు చేయడానికి బదులుగా మిగిల్చిన డబ్బును తమ కుమార్తె పేరుతో సేవింగ్స్ అకౌంట్లో వేస్తామని వారు చెప్పారు. భవిష్యత్తులో కారు లేదా ఇతర వస్తువులు కొనడానికి ఈ మొత్తాన్ని ఉపయోగించుకుంటామన్నారు.

పేరు నచ్చిందంటున్నారు
కొత్త పేరును కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని ఆ దంపతులు ఒప్పుకున్నారు. కానీ ఇది మంచి నిర్ణయమే అని పాప తండ్రి చెబుతున్నాడు. ఎక్కువసేపు దాని గురించి ఆలోచించినప్పుడు పేరు ప్రత్యేకంగా అనిపించిందని 35 ఏళ్ల ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ ప్రత్యేక పరిస్థితి గురించి తాను ఎక్కువగా ఆలోచించానని పాప తల్లి చెబుతోంది. తరువాత ఆ పేరు ఎప్పటికీ ఒక కనెక్షన్ గా నిలుస్తుందని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. ‘ఇంతకంటే బాగాలేని ఎన్నో పేర్లను మనం వింటుంటాం. Twifia అనే పేరు హృదయపూర్వకంగా వినిపిస్తుంది’ అని ఆమె పేర్కొంది.కంపెనీ హామీ
ఆ తల్లిదండ్రుల నిర్ణయాన్ని Twifi సంస్థ యజమాని ఫిలిప్ ఫోట్ష్ అభినందించారు. తమ సంస్థ ఈ వ్యాపారం నుంచి వైదొలగినా, రాబోయే 18 సంవత్సరాలకు ఈ జంట ఇంటర్నెట్ సదుపాయం కోసం డబ్బు చెల్లిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పిల్లలకు తమ సంస్థ పేరు పెట్టడం అనేది గౌరవంలో భాగమని ఫిలిప్ చెబుతున్నారు. తమ సంస్థ నుంచి ఈ ఆఫర్ ఇతర తల్లిదండ్రులకు కూడా అందుబాటులో ఉంటుందని ఆయన వివరించారు.
Published by: Srinivas Munigala
First published: October 19, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading