కొండచరియను పడేసేందుకు భారీ ఆపరేషన్... అదిరే వీడియో...

Norway : మనం రోజూ ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. కానీ... బహుశా ఇలాంటి వీడియోని ఎప్పుడూ చూసి ఉండం. ఎందుకంటే ఇది రొటీన్‌కి భిన్నంగా జరిగిన ఆపరేషన్.

news18-telugu
Updated: February 21, 2020, 1:13 PM IST
కొండచరియను పడేసేందుకు భారీ ఆపరేషన్... అదిరే వీడియో...
కొండచరియను పడేసేందుకు భారీ ఆపరేషన్... (credit - YT - torehum)
  • Share this:
Norway : సాధారణంగా కొండ చరియలు (బండరాళ్లు) విరిగి పడకూడదని మనం కోరుకుంటాం. కానీ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు కొండరాళ్లు జారి పడుతుంటాయి. వాటి వల్ల ఒక్కోసారి ఘాట్ రోడ్లు దెబ్బతింటాయి. ఒక్కోసారి అవి ఇళ్లపై పడి... ప్రజలు చనిపోతుంటారు కూడా. అందువల్ల కొండ చరియలు పడకుండా ఉండేందుకు... కొన్నిసార్లు అధికారులు చర్యలు కూడా తీసుకుంటారు. ఇది అందుకు భిన్నమైన ఆపరేషన్. ఇక్కడ కొండ చరియను పడేసేందుకు ఆపరేషన్ చేపట్టారు. నార్వే పబ్లిక్ రోడ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు... కొండ రాళ్ల పక్క నుంచీ... ఓ ఫెన్స్ (కంచె) లాంటిది నిర్మించాలని అనుకున్నారు. అందుకు రూట్ మ్యాప్, ప్లాన్ అన్నీ సిద్ధం చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నా... ఓ చోట మాత్రం కొండ చరియలు కింద పడేలా ఉన్నాయి. అవి పడకుండా అలాగే ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా అవి పడే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే పశ్చిమ నార్వేలో హైవే 70కి సమస్యలు తప్పవు. అందుకే బండరాళ్లను స్వయంగా పడేసేందుకు ఆపరేషన్ చేపట్టారు.కొండరాళ్లను కూల్చాలంటే పెద్ద సమస్యే కదా. ఈ ఆపరేషన్ కోసం... ఓ హెలికాప్టర్, గుండ్రంగా ఉండే స్లె్డ్జ్ హామ్మర్ (బంతిలా ఉండే సుత్తి) తీసుకొచ్చారు. హెలికాప్టర్‌కు స్లెడ్జ్ హామ్మర్‌ను వేలాడదీసి... దాని ద్వారా బండరాళ్లను కూల్చేసిన విధానం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన పాత వీడియోని ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్నారు.

నిజానికి ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఎప్పుడో 2009లో జరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత అప్పటి విజయవంతమైన ఆపరేషన్‌ను ఇప్పుడు నార్వే అధికారులు గుర్తుచేసుకున్నారు. దాంతో అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేకపోవడంతో... పెద్దగా ప్రచారం పొందని ఈ వీడియో... ఇప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతోంది. ఇందులో ప్రతీ సీన్ చూసేందుకు ఐఫీస్ట్‌గా ఉండటంతో ఇది చాలా బాగుందని అందరూ అంటున్నారు. అప్పటి ఆపరేషన్‌లో పాల్గొన్న వారిని మెచ్చుకుంటున్నారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు