Home /News /international /

SWEDEN PLANE CRASH SKYDIVING PLANE CARRYING 9 PEOPLE CRASHES IN SWEDEN ALL PASSENGERS KILLED SK

Sweden Plane Crash: స్వీడన్‌లో కుప్పకూలిన స్కైడైవింగ్ విమానం.. 9 మంది దుర్మరణం

కుప్పకూలిన విమానం (Image:AP)

కుప్పకూలిన విమానం (Image:AP)

Sweden Plane Crash: ఒరెబ్రో ఎయిర్‌పోర్టు నుంచి ఓ స్మాల్ ప్రొపెల్లర్ స్కైడైవింగ్ విమానం గాల్లోకి ఎగిరింది. అందులో 8 మంది స్కై డైవర్లు, ఒక పైలట్ ఉన్నారు. ఐతే టేకాఫ్ అవుతున్న సమయంలోనే ఆ విమానం కూలిపోయింది. రన్‌వే పక్కనే పడిపోయింది.

    స్వీడన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న చిన్న విమానం సాంకేతిక కారణాలతో కుప్పకూలింది. దేశరాజధాని స్టాక్ హోమ్‌కు దాదాపు 160 కి.మీ. దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్‌పోర్టు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 9 మంది ప్రయాణికులు మరణించారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఒరెబ్రో ఎయిర్‌పోర్టు నుంచి ఓ స్మాల్ ప్రొపెల్లర్ స్కైడైవింగ్ విమానం గాల్లోకి ఎగిరింది. అందులో 8 మంది స్కై డైవర్లు, ఒక పైలట్ ఉన్నారు. ఐతే టేకాఫ్ అవుతున్న సమయంలోనే ఆ విమానం కూలిపోయింది. రన్‌వే పక్కనే పడిపోయింది. విమాన ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. విమానం ముక్కలై పూర్తిగా కాలిపోయింది. కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి.


    ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు వెళ్లేసరికి అప్పటికే 8 మంది మరణించారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు తెలిసింది. తీవ్రగాయాల పాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. 2019లో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. 9 మంది స్కైడైవర్లతో వెళ్తున్న విమానం యుమీ ఎయిర్‌పోర్టు బయట కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 చనిపోయారు. తాజాగా జరిగిన ప్రమాదంలో కూడా 9 మందే మరణించారు. వీరు కూడా స్కైడైవర్లే కావడం గమనార్హం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: International news, Plane Crash

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు