True Love : ప్రేమంటే ఇదేరా...జర్మనీలో 23 రైళ్లను ఆపిన ట్రూ లవ్

Swan Blocks 23 Trains (From : Twitter)

True Love : ప్రేమ అనేది మనుషుల్లోనే కాదు.. జంతువులు, పక్షుల్లో కూడా ఉంటాయనడానికి జర్మనీలో జరిగిన ఘటనే ఉదాహరణ. నిస్వార్థమైన ప్రేమను చూపడంలో మనుషుల కన్నా జంతువులే మిన్నగా ఉంటాయి. తోడును కోల్పోయిన ఓ హంస ఏకంగా 23 హైస్పీడ్ రైళ్లను నిలిపివేసింది.

  • Share this:
    ప్రేమ అనేది మనుషుల్లోనే కాదు.. జంతువులు, పక్షుల్లో కూడా ఉంటాయనడానికి జర్మనీలో జరిగిన ఘటనే ఉదాహరణ. నిస్వార్థమైన ప్రేమను చూపడంలో మనుషుల కన్నా జంతువులే మిన్నగా ఉంటాయి. తోడును కోల్పోయిన ఓ హంస ఏకంగా 23 హైస్పీడ్ రైళ్లను నిలిపివేసింది. వివరాల్లోకి వెళితే.. రెండు హంసలు ఆకాశంలో విహారిస్తూ హై స్పీడ్‌ రైల్వే లైన్‌లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో ఒక హంస ఒవర్‌హెడ్‌ పవర్‌ కేబుల్‌లో చిక్కుకుని మరణించింది. దాంతో మిగిలిన హంస రైల్వే ట్రాక్‌ మీదనే ఉండి చనిపోయిన భాగస్వామి శరీరాన్ని చూస్తూ.. బాధపడసాగింది. అధికారులు హంసను అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేసినప్పటికి అది కదలలేదు. దాదాపు 50 నిమిషాల పాటు అలా చనిపోయిన హంసను చూస్తూ.. బాధపడుతూ.. సంతాప సూచకంగా అక్కడే ఉండిపోయింది. దాని మూగ వేదనను అర్థం చేసుకున్న అధికారులు హంసను అలాగే ఉండనిచ్చారు. దాదాపు 50 నిమిషాల తర్వాత అగ్నిమాపక దళ సిబ్బంది వచ్చి చనిపోయని హంస మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించడంతో జంట హంస కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ 50 నిమిషాల పాటు ట్రాక్‌పై రాకపోకలు సాగకపోవడంతో 23 రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

    ఇదిలా ఉంటే.. తోడును కోల్పోయి పట్టాలపై తిరుగుతున్న స్వాన్‌ ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. ఈ సంఘటనతో జంతువులు, పక్షులు కూడా ప్రేమ వంటి భావోద్వేగాలను కలిగి ఉండటమే కాక సున్నితంగా ఉంటాయని మరోసారి నిరూపితమైంది. అవి మనకంటే అధికంగా నొప్పిని అనుభూతి చెందుతాయిని రుజువైంది. అంతేకాక మనుషులు జంతువుల, పక్షులు వంటి మూగజీవుల పట్ల మరింత కరుణతో వ్యవహరించాలిన ఈ సంఘటన గుర్తు చేసింది.
    Published by:Sridhar Reddy
    First published: