హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

North Korea : మరో మిసైల్ ప్రయోగించిన కిమ్..అయితే క్షణాల్లోనే..

North Korea : మరో మిసైల్ ప్రయోగించిన కిమ్..అయితే క్షణాల్లోనే..

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(ఫైల్ ఫొటో)

Kim Jong Un : అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను కొనసాగిస్తూ పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్‌ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కిమ్. ఓ వైపు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని భయపడుతుంటే ఎవడు ఏమైతే నాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో మిసైల్ ప్రయోగం చేపట్టారు కిమ్.

ఇంకా చదవండి ...

North Korean Missile : కొత్త ఏడాదిలో వరుస క్షిపణుల పరీక్షల (missile testing)తో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది ఉత్తర కొరియా (North Korea).ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం..అమెరికాపై ఒత్తిడి పెంచడంలో భాగంగా క్షిపణి పరీక్షలతో విరుచుకుపడుతోంది. అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలతో సరికొత్త ప్రయోగాలను కొనసాగిస్తూ పొరుగునే ఉన్న దక్షిణ కొరియా, జపాన్‌ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు కిమ్. ఓ వైపు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని భయపడుతుంటే ఎవడు ఏమైతే నాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో మిసైల్ ప్రయోగం చేపట్టారు కిమ్.

ఆదివారం ఉత్తర కొరియా తమ తూర్పు తీరంలోని సముద్రం వైపు అత్యంత శక్తిమంతమైన బాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించిందని దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. ఆదివారం ఉదయం 7.52 గంటలకు నార్త్ కొరియా రాజధాని పాంగ్యాంగ్ సమీపంలోని సునాన్ నుండి తాజా మిసైల్ ను ప్రయోగించారు. గత బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఉత్తర కొరియా రాజధాని నుంచి గుర్తుతెలియని క్షిపణిని నార్త్ కొరియా ప్రయోగించిందని...అయితే ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి పరీక్ష విఫలమైందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఓ నివేదికలో తెలిపారు.

ALSO READ Pakistan: పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోనుందా ?.. నెలాఖరులో ఏం జరగనుంది ?

2017 నుంచి ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్ష చేస్తుందని అనుమానాలున్న నేపథ్యంలో ఈ ప్రయోగం జరిగిందని తెలుస్తోంది.గత వారంలో ఉత్తర కొరియా రెండు ఖండాంతర క్షిపణి పరీక్షలు జరిపిందని అమెరికా, దక్షిణ కొరియాలు వెల్లడించాయి. ఇప్పుడు ప్రయోగించిన క్షిపణి 2020లో ఉత్తర కొరియా మిలిటరీ పరేడ్‌లో మొదటిసారి ప్రదర్శించిన హాసంగ్‌-17 అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా పది సార్లు మిసైల్ ప్రయోగాలు జరిపింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Kim jong un, Missile, North Korea

ఉత్తమ కథలు