ఒబామా, క్లింటన్‌కు బాంబు పార్సిల్స్.. అనుమానితుడి అరెస్ట్

బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, హాలీవుడ్ మెగాస్టార్ రాబర్ట్ డీనిరో‌తో పాటు మరికొందరు ప్రముఖులు, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద వ్యతిరేకంగా మాట్లాడే వారి ఇళ్లకు బాంబు పార్సిల్స్ వెళ్లాయి.

news18-telugu
Updated: October 26, 2018, 10:06 PM IST
ఒబామా, క్లింటన్‌కు బాంబు పార్సిల్స్.. అనుమానితుడి అరెస్ట్
మన్‌హట్టన్‌లో ఉన్న పోస్టాఫీసులో పార్సిల్ బాంబును నిర్వీర్యం చేయడానికి వచ్చిన బాంబ్ స్క్వాడ్ (Reuters)
  • Share this:
ఒబామా, క్లింటన్ సహా సుమారు 12 మంది ప్రముఖులకు బాంబు పార్సిల్స్ పంపిన వ్యవహారంలో ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షులైన వారితో పాటు మరికొందరు ట్రంప్ వ్యతిరేకులకు ఈ పార్సిల్స్ వెళ్లాయి. దీంతో పెను దుమారం రేగింది. అమెరికాలో సంచలనం సృష్టించింది. ఒక అనుమానితుడిని భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్టు న్యాయశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఫ్లోరిడాలో అతడిని పట్టుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది ఏజెంట్లు అనుమానితుడి కోసం వేట సాగించాయి. చివరకు ఫ్లోరిడాలో పట్టుకున్నట్టు తెలిపారు.

బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్, హాలీవుడ్ మెగాస్టార్ రాబర్ట్ డీనిరో‌తో పాటు మరికొందరు ప్రముఖులు, ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద వ్యతిరేకంగా మాట్లాడే వారి ఇళ్లకు బాంబు పార్సిల్స్ వెళ్లాయి. ఇంట్లో తయారు చేసిన ఈ బాంబులను పార్సిల్ చేశారు. గత సోమవారం నుంచి ఈ పార్సిల్స్ చేరుకోవడం ప్రారంభించాయి. న్యూజెర్సీకి చెందిన డెమొక్రటిక్ సెసేటర్ కూరీ బుకర్‌కు పంపిన బాంబు పార్సిల్‌ను పోలీసులు గుర్తించారు. అలాగే, అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ జేమ్స్ క్లాపర్‌ అడ్రస్‌తో పంపిన పైప్ బాంబును మన్‌హట్టన్‌లోని ఓ పోస్టాఫీసులో బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది.

First published: October 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>