శిఖ గార్గ్ మృతుల కుటుంబ సభ్యుల్ని కనిపెట్టండి... ట్విట్టర్‌లో కోరిన సుష్మా స్వరాజ్

Ethiopian Plane Crash : ఇథియోపియా విమాన ప్రమాదంలో చనిపోయిన శిఖ గార్గ్ మృతుల కుటుంబ సభ్యుల్ని కనిపెట్టేందుకు కేంద్ర విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 11, 2019, 1:23 PM IST
శిఖ గార్గ్ మృతుల కుటుంబ సభ్యుల్ని కనిపెట్టండి... ట్విట్టర్‌లో కోరిన సుష్మా స్వరాజ్
శిఖ గార్గ్ (Image Credits: Twitter/shikha_un)
Krishna Kumar N | news18-telugu
Updated: March 11, 2019, 1:23 PM IST
ఇథియోపియా విమాన ప్రమాదంలో చనిపోయిన భారతీయ మహిళ కుటుంబ సభ్యుల్ని కనుక్కునేందుకు సాయం చెయ్యమంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ట్వీట్‌కి నెటిజన్ల నుంచీ పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచీ బయలుదేరిన వెంటనే కూలిపోయిన ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమాన ప్రమాదంలో మొత్తం 157 మంది ప్రయాణికులు చనిపోయారు. వారిలో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. వారు వైద్య పన్నగేశ్ భాస్కర్, వైద్య హన్సిన్ అన్నగేశ్, నూకవరపు మనీష, శిఖా గార్గ్‌ అని సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు తగిన సాయం, మద్దతు అందించాలని ఇథియోపియాలోని భారత హై కమిషనర్‌ను కోరినట్లు ఆమె ట్విటర్‌లో తెలిపారు.





మృతుల్లో ఒకరైన శిఖా గార్గ్ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్నారు. ఆమె నైరోబీలో జరగాల్సిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు ఫోర్త్ సెషన్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ప్రమాదంలో చనిపోయారని సుష్మా స్వరాజ్ ప్రకటించారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ శిఖ గార్గ్ మృతి దురదృష్టకరమని, ఆమెతో పాటు ఇతర ప్రయాణీకుల మృతికి తన సంతాపం ప్రకటించారు.



శిఖా గార్గ్ ఫ్యామిలీకి ఈ విషయం తెలిసేలా చెయ్యాలనీ, వాళ్లను కలిసేందుకు హెల్ప్ చెయ్యాలని ట్విట్టర్‌లో కోరారు సుష్మాస్వరాజ్.



దీనిపై స్పందించిన నెటిజన్లు... తమ వంతుగా #ShikhaGarg హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు.



కెన్యా రాజధాని నైరోబీకి వెళ్లాల్సిన ఇథియోపియా విమానం... టేకాఫ్ అయిన ఆరు నిమిషాలకే కూలిపోయింది. బోయింగ్ తయారు చేసిన 737 మాక్స్ 8 మోడలైన ఆ విమానం కొన్ని నెలల కిందటే సేవలు ప్రారంభించింది. 2018 అక్టోబర్‌లో ఇండొనేసియాలో లయన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఇలాంటి బోయింగ్ మోడల్ విమానమే బయలుదేరిన 13 నిమిషాల తర్వాత కూలిపోయింది. ఆ ప్రమాదంలో 189 మంది ప్రయాణికులు చనిపోయారు.

 

ఇవి కూడా చదవండి :

పశ్చిమాన మొదలై తూర్పున ముగిసే పోలింగ్ దశలు... ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కలిసొస్తాయా?

ఈసారి ఎన్నికల్లో కొత్తదనం ఏముంది? కొత్తగా ఏ రూల్స్ తెచ్చారు?

టీడీపీ - వైసీపీ ... ఏ పార్టీ పథకాలు గొప్పవి ... విజయం ఎవరిది?

Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా... లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి
First published: March 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...