Home /News /international /

SURPRISING AND UNBELIEVABLE SUPERSTITIONS IN THE WORLD THAT PEOPLE FOLLOW EVEN NOW A DAYS NK

ప్రపంచంలో వింత మూఢ నమ్మకాలు... తెలుసుకుంటే ఆశ్చర్యమే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Superstitions Around The World : నమ్మకం మనల్ని బతికిస్తుంది. అదే నమ్మకం అతి అయితే ప్రమాదం కూడా. ప్రపంచ దేశాల్లో వింత నమ్మకాల్ని తెలుసుకుందాం.

దేనినైనా నమ్మడం మన లక్షణం. అన్నింటికీ ఆధారాలు ఉండవు. దేవుడు, దెయ్యం, మంత్రాలు, ప్రకృతి శక్తులు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో. మన తాతలు, ముత్తాతలూ ఫాలో అయిన సంప్రదాయాల్లో కొన్నింటిని మనమూ పాటిస్తూ ఉంటాం. కొన్ని కొత్తగా పుట్టుకొస్తుంటాయి. కాలగమనంలో ఎన్నో వింతలు, విచిత్రాలూ మన జీవితంలో భాగమవుతాయి. వాటిని ఫాలో అయ్యేవారున్నట్లే, వ్యతిరేకించేవాళ్లూ ఉన్నారు. కొందరు వాటిని పిచ్చి నమ్మకాలు అంటే కొందరు వాటిని పాటించకపోతే ప్రమాదమే అంటారు. అలాంటి ఆశ్చర్యకమైన ఆచారాల్ని తెలుసుకుందాం.

* లాటిన్ అమెరికాలో మంగళవారం పెళ్లి చేసుకోరు. ఆ రోజు చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులైనట్లేనని నమ్మకం. అసలక్కడ మంగళవారం పెళ్లిళ్లకు జనం కూడా వెళ్లరట.

* జపాన్‌లో ఉత్తరం లేదా పశ్చిమం వైపు చూస్తూ ఎవరూ నిద్రపోరట. ఎందుకంటే జపాన్‌లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంచుతారు. ఆఫ్రికాలో పశ్చిమంవైపు చూస్తున్నట్లు ఉంచుతారు. అందుకని జపనీస్ అలా నిద్రపోరట.

* ఇళ్లు, ఆఫీసులు, ఫ్యాక్టరీల్లో పని చేస్తూ ఈల వెయ్యడం లిథువేనియాలో సమస్యే. అలా చేస్తే పిశాచాల్ని పిలిచినట్లు అవుతుందట. వచ్చిన పిశాచాలు విజిల్ వేసిన వారి పక్కనే తిష్టవేస్తాయని మూఢ నమ్మకం.

* జర్మనీలో కొవ్వొత్తితో సిగరెట్ వెలిగించకూడదు. అది సముద్ర నావికులకు చెడు చేస్తుందట.

* ఆఫ్రికా దేశం రువాండాలో మహిళలు మేక మాంసం తినకపోవడమే మంచిదట. ఎక్కువగా మేక మాంసం తింటే, ముఖంపై వెంట్రుకలు మొలుస్తాయని మూఢ నమ్మకం.

* వర్షం పడుతుంటే మనం ఏం చేస్తాం. ఇంట్లోంచీ బయటకు వెళ్తూ... గొడుగు ఓపెన్ చేస్తాం. ఇంట్లో ఉండగానే గొడుగు తెరిస్తే దురదృష్టం వెంటాడుతుందట. ఇంట్లో లోహ వస్తువులు, గొడుగు విడి భాగాలు, బయటి వర్షం అన్నీ కలిసి గాయపరుస్తాయని ఓ నమ్మకం.

* ఐస్ ల్యాండ్‌లో ఆరుబయట అల్లికలు (దారాలతో అల్లుట) ఉండవు. అలా చేస్తే చలికాలం మరింత ఎక్కువ కాలం కొనసాగుతుందని ఓ ప్రచారం. అందుకే ఎవరూ అలా చెయ్యరు.

* నిచ్చెన కింది నుంచీ వెళ్లడం మంచిది కాదనే ప్రచారం ఒకటుంది. మధ్యయుగంలో ప్రజలను నిచ్చెనలకు వేలాడదీసి ఉరి వేసేవాళ్లు. అందువల్ల చాలా దేశాల్లో గోడకు ఆనించివున్న నిచ్చెన కింది నుంచీ ఎవరూ వెళ్లరు.

* అజర్‌బైజాన్‌లో ఉప్పు, మిరియాల పొడిని ఆహార పదార్థాలపై చల్లుకోరు. ఎందుకంటే ఆ దేశంలో అవి చాలా రేటెక్కువ. వాటిని చల్లుకుంటే ఎంతోకొంత గాలికి చెల్లా చెదురవుతాయనీ, వృథా అవుతాయని ప్రజలు అలా చెయ్యరు.

* దక్షిణ కొరియాలో ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్లను కదపకూడదట. అలా చేస్తే ఆ వ్యక్తి సంపద మొత్తం చేజారిపోతుందని నమ్మకం. అందుకే దక్షిణ కొరియాలో ఎవరైనా కాళ్లు కదుపుతూ ఉంటే... అందరూ ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తారట.

ఇవి కూడా చదవండి :

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా... ఇలా చెయ్యండి

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి

Health Tips : శరీరానికి సరిపడా ఐరన్ తీసుకుంటున్నారా... ఇలా చెయ్యండి

ఒక్కోటీ ఒక్కో వింత వెబ్ సైట్ ... ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేం

ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకర విశేషాల కోసం న్యూస్18తెలుగుతో టచ్‌లో ఉండండి.
Published by:Krishna Kumar N
First published:

Tags: VIRAL NEWS, World

తదుపరి వార్తలు