అంటార్కిటికాలో సూపర్‌నోవా ధూళి... 2 కోట్ల ఏళ్ల నాటిదిగా గుర్తింపు...

Supernova Dust : ఈ భూమిపై అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్న ఖండం అంటార్కిటికా. అక్కడ మనుషులు జీవించేందుకు అవకాశాలు లేకపోవడంతో... పరిశోధనలు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. తాజాగా అక్కడ కనుక్కున్న ఓ విషయం ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 28, 2019, 9:47 AM IST
అంటార్కిటికాలో సూపర్‌నోవా ధూళి... 2 కోట్ల ఏళ్ల నాటిదిగా గుర్తింపు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Antarctica : భూమికి దక్షిణ ధ్రువాన ఉన్న అంటార్కిటికా మంచులో ఓ రకమైన ఐరన్ (ఇనుము)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాన్ని ఐరన్ ఐసోటోప్ Fe-60 అని పిలుస్తున్నారు. నిజానికి అది ఇప్పుడు తయారైన ఇనుము కాదు. ఎప్పుడో మన సౌర కుటుంబం ఏర్పడినప్పుడే... అది కూడా తయారైందని గుర్తించారు. అంతరిక్షంలో సూపర్ నోవా ఏర్పడినప్పుడు... దాని నుంచీ వచ్చిన ఆ ఇనుము... అంటార్కిటికాలో పడిందని చెబుతున్నారు. సూపర్ నోవా అంటే... నక్షత్రం శక్తిని కోల్పోతూ... కుచించుకుపోతూ... ఆవగింజంత పరిమాణంలోకి వెళ్లాక... ఒక్కసారిగా పేలిపోతుంది. అలా పేలడాన్నే సూపర్ నోవా అంటారు. అలా పేలిన నక్షత్రం... బ్లాక్ హోల్‌గాగానీ లేదా... మరుగుజ్జు నక్షత్రంగా గానీ మారుతుంది. ఐతే... సూపర్ నోవా ఏర్పడినప్పుడు... దాని నుంచీ ఖనిజాలు, లోహాలూ... అంతరిక్షంలోకి వేగంగా విసిరేసినట్లు వెళ్లిపోతాయి. అలా రెండు కోట్ల సంవత్సరాల కిందట ఓ సూపర్ నోవా నుంచీ బయటకు వచ్చిన ఇనుము... అంటార్కిటికాలో పడిందన్నమాట.

గత 20 ఏళ్లుగా... సూపర్ నోవా నుంచీ వచ్చే దుమ్ము, ధూళి... అంటార్కిటికాలో పోగవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ దుమ్ము, ధూళీ... 2 కోట్ల సంవత్సరాల కిందటిదిగా తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని ఫిజికల్ రివ్యూ లెటర్స్ జర్నల్‌లో రాశారు. తాజాగా కనుక్కున్న ఐరన్ ద్వారా... మన సౌర కుటుంబం ఎప్పుడు ఏర్పడిందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉందంటున్నారు.

 

ఇవి కూడా చదవండి :
తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...

Health : పొట్టను తగ్గించే ఇంటి చిట్కాలు... ఇలా చెయ్యండి


Video : సఫారీలో జీప్ ఎక్కిన చిరుత... సెల్ఫీ తీసుకుంటుంటే...
First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>