• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • SUN DOGS THREE SUNS APPEAR IN CHINA DUE TO RARE PHENOMENON VIRAL VIDEO WILL AMAZE YOU NK

Three Suns: ఒకేసారి మూడు సూర్యుళ్లు.. ఆకాశంలో అరుదైన దృశ్యం.. వైరల్ వీడియో

Three Suns: ఒకేసారి మూడు సూర్యుళ్లు.. ఆకాశంలో అరుదైన దృశ్యం.. వైరల్ వీడియో

Three Suns: ఒకేసారి మూడు సూర్యుళ్లు.. ఆకాశంలో అరుదైన దృశ్యం.. (credit - twitter)

Three Suns: మనకు ఉన్నది ఒక సూర్యుడే కదా... మరి మూడేంటి... అని డౌట్ రావచ్చు. అందుకే అది అరుదైన సందర్భం అయ్యింది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.

  • Share this:
    Three Suns in China: చైనాలోని... మోహే నగర ప్రజలకు ఓ అదృష్టం ఉంటుంది. అప్పుడప్పుడూ వాళ్లు ఆకాశంలో ఒకేసారి ఐదు సూర్యుళ్లు లేదా మూడు సూర్యుళ్లను కళ్లారా చూస్తారు. దీన్నే సన్ డాగ్ (Sun Dog) అంటారు. మన ఆకాశంలో ఎన్నో అద్భుతాలలాగే ఇదీ ఒకటి అనుకోవచ్చు. తుఖియాంగ్ పట్టణంలో ఈ సారి ఏకంగా మూడు గంటల పాటూ... మూడు సూర్యుళ్లు ఆకాశంలో కనిపించాయి. ఉదయం 6:30కి మొదలైన ఈ దృశ్యం... ఉదయం 9:30 వరకూ కొనసాగింది. ఈ మూడు సూర్యుళ్లను ప్రజలు వీడియోలు తీశారు. ఆటోమేటిక్ గా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మూడు సూర్యుళ్లలో మధ్యలో ఉన్నది అసలైన సూర్యుడు. కుడి, ఎడమ పక్కన ఉన్నవి సూర్యుడు కాదు... కానీ... అవి కూడా సూర్యుళ్లలాగే కనిపిస్తాయి. అవి సూర్యుడి ప్రతిరూపాలు. వాటిని ఫాంటమ్ సూర్యుళ్లు (Phantom Suns) అంటారు.


    ఈశాన్య చైనాలో ఈ దృశ్యం అప్పుడప్పుడూ కనిపిస్తుంది. తాజా అద్భుతాన్ని చూసి ప్రజలు పరమానందం చెందారు. ఆశ్చర్యపోయారు. వావ్... సూపర్.. భలేవుంది... అంటూ సంబరపడిపోయారు.


    ఎలా సాధ్యం?:
    సహజ సిద్ధంగా ఏర్పడే పరిణామం ఇది. మనం అప్పుడప్పుడూ చందమామ చుట్టూ పెద్ద వలయాన్ని చూస్తూ ఉంటాం కదా... అలాగే... సూర్యుడి చుట్టూ కూడా అప్పుడప్పుడూ వలయం ఏర్పడుతుంది. ఆ సమయంలో... మంచు కణాలు... సూర్యుడి చుట్టూ ఏర్పడతాయి... వాటిలో చాలా వరకూ కరిగిపోతాయి. అలా కరిగిపోగా... మిగిలినవి... గుండ్రంగా వలయంలా ఏర్పడతాయి. వలయం లోపల అవి ఉండవు... వలయం అవతల ఆకాశంలో అవి ఉంటాయి. అందువల్ల అవి లేని చోట కాంతి ఎక్కువగా... ఉన్నచోట కాంతి తక్కువగా ప్రసరిస్తుంది. అందుకే గుండ్రటి వలయం కనిపిస్తుంది. ఐతే... మంచు కణాల్లో... సిర్రస్ మేఘాలు ఏర్పడితే... ఆ మేఘాల్లో సూర్య కిరణాలు ప్రసరించినప్పుడు... సూర్యుడి ప్రతిరూపం ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు మూడు సూర్యుళ్లు ఏర్పడ్డాయి. ఒక్కోసారి... ప్రతి రూపాల నుంచి కాంతి కిరణాలు ప్రసరించి... మరో రెండు ప్రతిరూపాలు కూడా వస్తాయి... అప్పుడు ఒకేసారి ఐదు సూర్యుళ్లు కనిపిస్తాయి.


    ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ సేపు మూడు సూర్యుళ్లు కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి ఇలాంటి దృశ్యాలు ప్రపంచమంతా కనిపిస్తాయి. కానీ అవి చాలా తక్కువ కాంతితో కనిపిస్తాయి. అందువల్ల వాటిని గుర్తుపట్టే పరిస్థితి ఉండదు. చైనాలో మాత్రం అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే సంవత్సరం... ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో... ఒకేసారి ఐదు సూర్యుళ్లు కనిపించాయి. 2015లో రష్యాలోని చెల్యాబిన్స్క్ ప్రాంతంలో మూడు సూర్యుళ్లు కనిపించాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు