కిమ్‌తో చర్చలపై ట్రంప్ సంతృప్తి

ప్రపంచానికి ఇక ఉత్తరకొరియా ఏ మాత్రం అణుప్రమాదకారి కాదు. అమెరికా, యావత్ ప్రపంచం ఇక రాత్రిపూట హాయిగా నిద్రపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Janardhan V | news18
Updated: June 14, 2018, 10:14 AM IST
కిమ్‌తో చర్చలపై ట్రంప్ సంతృప్తి
సింగపూర్ చర్చల్లో డొనల్డ్ ట్రంప్-కిమ్ జోంగ్ ఉన్.
  • News18
  • Last Updated: June 14, 2018, 10:14 AM IST
  • Share this:
ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో తాను జరిపిన చర్చల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. కిమ్‌తో జరిపిన అనూహ్య భేటీతో ప్రపంచం ఒక అణు విపత్తు నుంచి బయటపడినట్లయిందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రపంచానికి ఉత్తర కొరియా అణు ప్రమాదకారి  ఏ మాత్రం కాబోదని అన్నారు. ఇక అమెరికా, యావత్ ప్రపంచం రాత్రిపూట హాయిగా నిద్రపోవచ్చని అన్నారు. కిమ్, తాను కలిసిన రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కిమ్‌తో చర్చల తర్వాత సింగపూర్‌ నుంచి వాషింగ్టన్‌కు వస్తూ ట్విటర్లోనూ, మీడియాతోనూ  ఈ మేరకు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తన సింగపూర్‌ పర్యటన నిజంగా అద్భుతమైనదిగా వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి తొలి సాహసోపేత అడుగు వేసిన కిమ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. నిజమైన మార్పు సాధ్యమేననేది తమ మధ్య సింగపూర్ వేదికగా తొలిసారిగా జరిగిన భేటీతో రుజువయిందన్నారు.


ఇకపై రాకెట్‌ ప్రయోగాలు, అణు పరీక్షలు, అణు పరిశోధనలు ఉండవని, ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్నవారంతా తిరిగి తమ కుటుంబాలను చేరుకుంటారని అన్నారు. ఇందుకు గాను కిమ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అణ్వాయుధాలను విడనాడి, ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను పెంపొందించుకుంటే ఉత్తర కొరియా సాధించలేనిదంటూ ఏదీ ఉండదన్నారు. భద్రతను, సుసంపన్నతను తమ దేశ ప్రజలకు అందించిన నేతగా కిమ్‌ గుర్తుండిపోతారని చెప్పారు. యుద్ధాన్ని ఎవరైనా చేయవచ్చనీ, అత్యంత ధైర్యవంతులు మాత్రమే శాంతిని సాధించగలగరనీ పునరుద్ఘాటించారు.
Published by: Janardhan V
First published: June 14, 2018, 10:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading