#WHO : ఆత్మహత్యలపై సంచలన రిపోర్ట్.. ప్రతీ 40సెకండ్లకు ఒక ప్రాణం..

WHO Report on Suicides : 2016లో ప్రపంచవ్యాప్తంగా సూసైడ్ రేట్ 10.5శాతం ఉందని..అంటే ఆ ఏడాది 1లక్ష మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపింది. గన్ కల్చర్ ఎక్కువగా ఉండే అమెరికాలో గత ఆరేళ్లలో సూసైడ్ రేట్ 4.2శాతం పెరిగిందని పేర్కొంది.

news18-telugu
Updated: September 10, 2019, 7:42 AM IST
#WHO : ఆత్మహత్యలపై సంచలన రిపోర్ట్.. ప్రతీ 40సెకండ్లకు ఒక ప్రాణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా 8లక్షల మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) సంచలన విషయాన్ని బయటపెట్టింది. యుద్దంలో చనిపోతున్నవాళ్ల కంటే,హత్యల్లో చనిపోతున్నవాళ్ల కంటే,బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోతున్నవాళ్ల కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ.. తక్షణం ఆత్మహత్యల నివారణపై దృష్టి సారించాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది.

నిజానికి 2010-2016 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సూసైడ్ రేట్ తగ్గిపోయిందని.. కానీ పెరిగిన జనాభా కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నవారి సంఖ్యలో మార్పు ఏమీ రాలేదని ఐక్యరాజ్య సమితి హెల్త్ ఏజెన్సీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 40 సెకండ్లకు ఒక ఆత్మహత్య జరుగుతోందని వెల్లడించింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా సూసైడ్ రేట్ 10.5శాతం ఉందని..అంటే ఆ ఏడాది 1లక్ష మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపింది. గన్ కల్చర్ ఎక్కువగా ఉండే అమెరికాలో గత ఆరేళ్లలో

సూసైడ్ రేట్ 4.2శాతం పెరిగిందని పేర్కొంది.

ఆత్మహత్యలకు పాల్పడుతున్నవాళ్లలో ఎక్కువమంది ఉరి వేసుకుని,గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా పురుగుల మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ వెల్లడించింది. దిగువ,మధ్య స్థాయి ఆదాయ దేశాల్లోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపింది. సూసైడ్ రైట్ ఎక్కువగా ఉన్న దేశాల్లో గయానా,రష్యా,లెసోతో,ఉగాండ,శ్రీలంక,సౌత్ కొరియా,ఇండియా,జపాన్ ఉన్నాయని వెల్లడించింది.
First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading