Sudan Protest : ఆంక్ష‌ల భ‌యానికి వెన‌క్కి త‌గ్గిన సుడాన్‌ సైన్యం.. ఆగని నిర‌స‌లు

sudan flag

Sudan Protest : సుడాన్‌ (Suddan) లో సైన్యం వెన‌క్కు త‌గ్గింది. ప్ర‌ధాన‌మంత్రి అబ్దుల్లా హమ్‌డోక్‌ను విడుద‌ల చేసేందుకు సైన్యం నిర్ణ‌యించుకొన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానితోపాటు ఆయ‌న భార్య మునా అబ్దుల్లాను సైన్యం విడుద‌ల చేయ‌నుంది. అయితే ఇతర అధికారులు మాత్రం సైన్యం గుప్పిట్లోనే ఉన్నట్లు స‌మాచారం.

  • Share this:
    సుడాన్‌ (Sudan) లో సైన్యం వెన‌క్కు త‌గ్గింది. ప్ర‌ధాన‌మంత్రి అబ్దుల్లా హమ్‌డోక్‌ను విడుద‌ల చేసేందుకు సైన్యం నిర్ణ‌యించుకొన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌ధానితోపాటు ఆయ‌న భార్య మునా అబ్దుల్లాను సైన్యం విడుద‌ల చేయ‌నుంది. అయితే ఇతర అధికారులు మాత్రం సైన్యం గుప్పిట్లోనే ఉన్నట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని కార్యాల‌యం వెల్లడించింది. సుడాన్ ప‌రిణామాల‌ను అమెరికా (America) తీవ్రంగా ప‌రిగ‌ణించి సూడాన్‌కు 700 మిలియన్ డాలర్ల (700 Million Dollars) ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్న ట్లు ప్రకటించింది. సూడాన్‌ ప్రధానితోపాటు అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని అమెరికా స్ప‌ష్టం చేసింది. అంతేకాకుండా అతి త్వ‌ర‌లో సాధార‌ణ ప‌రిస్థితుల‌కు దేశాన్ని తీసుకురావాల‌ని ఇప్ప‌టికే సూచించింది. అంతర్జాతీయ (International) స్థాయిలో తీవ్ర వ్య తిరేకత, నిధుల నిలిపివేత హెచ్చ రికలతో సైన్యం వెన‌క్కి త‌గ్గిన‌ట్టు స‌మాచారం.

    ఆగ‌ని ఆందోళ‌న‌లు.. త‌గ్గ‌ని ఉద్రిక్త‌త‌..
    సైన్యం ప్ర‌ధానిని విడుద‌ల చేసిన అనంత‌రం కూడా ప్ర‌ధాని అబ్దుల్లా గృహనిర్బంధం లాంటి వాతావరణం లోనే ఉండనున్నారు అనే వార్త దేశ‌మంత వ్యాపించింది. అంతే కాకుండా అబ్దుల్లా నివాసం ఉన్న ఖర్తోమ్ పరిసరాల్లో భారీగా సైనికులు పహారా కాస్తున్నారు.

    Princess Mako Marriage : రాచ‌రికం.. రాజాభ‌రణం ఏదీ వ‌ద్దు.. మ‌న‌సైన‌వాడు చాలు : సామాన్యుడిని పెళ్లి చేసుకొన్న జ‌పాన్ రాకుమారి మ‌కో


    దీంతో దేశ‌వ్యాప్తంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, నిర‌స‌న‌లు ఆగ‌ట్లేదు. రాజధాని ఖార్టూమ్, ఓమ్‌దుర్మా న్‌ నగరం లో వేలాది మం ది వీధుల్లోకి వచ్చి ఆం దోళన చేపట్టారు. సైన్య వారిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ క్ర‌మంలోనే కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో 140 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఏడుగురు మృతి చెందారు.

    ఎందుకు ఈ స‌మ‌స్య‌..
    సూడాన్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్‌ అల్‌-బషీర్‌పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సైన్యం జోక్యంతో 2019లో అల్‌-బషీర్‌ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య (Democracy) పాలనకు అక్కడ ప్రయత్నాలు జరిగాయి. అధికారం చేపట్టేం దుకు సైన్యం - ప్రజాస్వా మ్య వాదుల మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానిగా అబ్దల్లా హమ్‌దోక్‌ మూడేళ్లపాటు బాధ్య తలు చేపట్టాల్సి ఉంది. ఇదే సమయంలో అధికార మార్పిడి కోసం సైన్యం , పౌర నేతల మధ్యవివాదాలు మొదలయ్యా యి. దీంతో గతనెలలో సైన్యం తిరుగుబాటు చేయాలని ప్రయత్నిం చినప్ప టికీ అది విఫలమయ్యిం ది. దీంతో సైన్యం కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోంది.
    Published by:Sharath Chandra
    First published: