Sudan Protest : ప్ర‌ధానిని అరెస్టు చేసిన సైన్యం.. అక్క‌డ ఏం జ‌రుగుతోంది!

సుడాన్ ప్రధాన మంత్రి అబ్దుల్లా హమ్‌డాక్ (ఫైల్‌)

Sudan Protest : సుడాన్ (Sudan)లో సైన్యం పూర్తి ప‌ట్టు సాధిస్తోంది. దేశంలో చెల‌రేగిన తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. ఆ దేశ ప్రధాన మంత్రి అబ్దుల్లా హమ్‌డాక్ (Prime Minister Abdalla Hamdok)ను సైన్యం గృహ నిర్భంధంలో ఉంచింది. అయితే ఆయన ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని అక్క డి సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

  • Share this:
    సుడాన్ (Sudan)లో సైన్యం పూర్తి ప‌ట్టు సాధిస్తోంది. దేశంలో చెల‌రేగిన తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. ఆ దేశ ప్రధాన మంత్రి అబ్దుల్లా హమ్‌డాక్ (Prime Minister Abdalla Hamdok)ను సైన్యం గృహ నిర్భంధంలో ఉంచింది. అయితే ఆయన ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని అక్క డి సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటిం చిం ది. ఆయ‌న‌తోపాటు సైన్యం త‌మ‌కు వ్య‌తిరేఖంగా ఉన్న అనేకమంది సీనియర్ అధికారులను, గృష నిర్బంధంలో లేదా అరెస్ట్ (Arrest) చేశారు. తమకు మద్దతుగా ప్రకటన చేయాలని ప్రధానిని సైన్యం ఒత్తిడి చేస్తోందని ఆ దేశ సమాచార మంత్రిత్వశాఖ (Ministry of Information) ట్వీట్ చేసింది. అంతే కాకుండా సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని దేశంలోని ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో ఆదేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.

    తిరుగుబాటుపై సైన్యం క‌న్ను..
    ప్ర‌జా తిరుగుబాటును ఎప్ప‌టిక‌ప్పుడు అంచ‌నా వేస్తోంది. అంతే కాకుండా నిరసనలు ఉద్ధృతం కాకుండా చూసేందుకు సైన్యం ప్ర‌త్యేక‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆందోళ‌ల‌ను మ‌రింత పెర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లో భాగంగా ఇంట‌ర్నెట్ సేవలను నిలిపివేసింది. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితిని అదుపుచేసేందుకు సైన్యం తీవ్రంగా శ్ర‌మిస్తోంది.

    US News: ఆఫ్ఘ‌న్‌ల కోసం స్పాన్సర్ సర్కిల్ ప్రోగ్రామ్ : అమెరికా


    ఎందుకు ఈ స‌మ‌స్య‌..
    సూడాన్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్‌ అల్‌-బషీర్‌పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సైన్యం జోక్యంతో 2019లో అల్‌-బషీర్‌ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పాలనకు అక్కడ ప్రయత్నాలు జరిగాయి. అధికారం చేపట్టేం దుకు సైన్యం - ప్రజాస్వా మ్య వాదుల మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానిగా అబ్దల్లా హమ్‌దోక్‌ మూడేళ్లపాటు బాధ్య తలు చేపట్టాల్సి ఉంది. ఇదే సమయంలో అధికార మార్పిడి కోసం సైన్యం , పౌర నేతల మధ్యవివాదాలు మొదలయ్యా యి. దీంతో గతనెలలో సైన్యం తిరుగుబాటు చేయాలని ప్రయత్నిం చినప్ప టికీ అది విఫలమయ్యిం ది. దీంతో సైన్యం కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోంది.

    ఎనిమిదోసారి తిరుగుబాటు..
    ప్ర‌ధాని అరెస్టుతో దేశవ్యా ప్తం గా ఆందోళనలు మొదలయ్యా యి. దీంతో విమాన సర్వీసులు రద్దు చేసింది. అయితే, ప్రధానమం త్రి అబ్దల్లా హమ్‌దోక్‌ను అరెస్టు చేసినట్లు వార్తలు వ‌స్తున్నాయి. ఇక స్వాతంత్రం పొం దిన 1956 నుంచి సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేయడం ఇది ఎనిమిదవసారి కావడం గమనార్హం. ఇది ఇలా ఉంటే ఇలా సూడాన్‌లో సైన్యం తిరుగుబాటు చేస్తోందంటూ వస్తోన్న వార్తలపై అమెరికా (America), యూరోపియన్‌ యూనియన్‌ ఆం దోళన వ్య క్తం చేశాయి.ఆందోళనలు మరిం త తీవ్రతరం కాకుంకా సైన్యం ప్ర‌యత్నిస్తున్నా ప‌రిస్థితులు అదుపుత‌ప్పేలా ఉన్నాయి.
    Published by:Sharath Chandra
    First published: