Sudan Protest : సుడాన్ తిరుగుబాటు దారుల‌కు అమెరికా షాక్‌.. ఆర్థిక‌సాయం నిలిపివేత‌.. ఆంక్ష‌లు విధించే అవ‌కాశం

ప్రతీకాత్మక చిత్రం

Sudan Protest : సుడాన్‌ (Sudan)లో రోజు రోజుకు ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ప్ర‌భుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. సుడాన్ ప్ర‌ధాని తాత్కా లిక ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌ సహా.. వారికి వ్య‌తిరేఖ‌మైన‌ పలువురు అధికారులను ఇప్ప‌టికే నిర్బంధించింది. ఈ ప‌రిణామాల‌ను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ నేప‌థ్యంలో 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్న ట్లు ప్రకటించింది.

 • Share this:
  సుడాన్‌ (Sudan)లో రోజు రోజుకు ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ప్ర‌భుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. సుడాన్ ప్ర‌ధాని తాత్కా లిక ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌ సహా.. వారికి వ్య‌తిరేఖ‌మైన‌ పలువురు అధికారులను ఇప్ప‌టికే నిర్బంధించింది. ఈ ప‌రిణామాల‌ను అమెరికా తీవ్రంగా ఖండించింది. వెంట‌నే సుడాన్‌లోని చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించి సూడాన్‌కు 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్న ట్లు ప్రకటించింది. సూడాన్‌ ప్రధానితోపాటు అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని అమెరికా స్ప‌ష్టం చేసింది. అంతేకాకుండా అతి త్వ‌ర‌లో సాధార‌ణ ప‌రిస్థితుల‌కు దేశాన్ని తీసుకురావాల‌ని సూచించింది. ప్రస్తుతానికి నిలిపివేసిన 700 మిలియన్ డాలర్లతోపాటు సూడాన్‌కు అమెరికా (America) ఎంత సాయం అందచేయనుందో.. వాటిని నిలుపుద‌ల‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  ఆంక్ష‌లు విధిస్తామ‌ని హెచ్చ‌రిక‌..
  సుడాన్‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హ‌రాల‌ను అమెరికా నిరంత‌రం ప‌రిశీలిస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై అమెరికా ప్ర‌తినిధి నెడ్ ప్రైస్ మాట్లాడారు. ఆ దేశ సైన్యం చేసిన తిరుగుబాటు అనేది సూడాన్‌ పౌరుల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు తూట్లుపొడవడమేనని, దేశ రాజ్యాంగ విధానాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సుడాన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను నిరంత‌రం ప‌రిశీలిస్తున్నామ‌ని వారు తెలిపారు. అంతే కాకుండా గ‌తేడాది ‘ఉగ్రవాదానికి నిధులు సమకూర్చు తున్న దేశాల జాబితా’ నుంచి సూడాన్‌ను అమెరికా తొల‌గించింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు కొన‌సాగితే తిరిగి అదే త‌ర‌హా ఆంక్ష‌లు విధించే అవ‌కాశం ఉంద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది.

  ఎందుకు ఈ స‌మ‌స్య‌..
  సూడాన్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒమర్‌ అల్‌-బషీర్‌పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సైన్యం జోక్యంతో 2019లో అల్‌-బషీర్‌ చివరకు గద్దె దిగాల్సి వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పాలనకు అక్కడ ప్రయత్నాలు జరిగాయి.

  Princess Mako Marriage : రాచ‌రికం.. రాజాభ‌రణం ఏదీ వ‌ద్దు.. మ‌న‌సైన‌వాడు చాలు : సామాన్యుడిని పెళ్లి చేసుకొన్న జ‌పాన్ రాకుమారి మ‌కో


  అధికారం చేపట్టేం దుకు సైన్యం - ప్రజాస్వా మ్య వాదుల మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానిగా అబ్దల్లా హమ్‌దోక్‌ మూడేళ్లపాటు బాధ్య తలు చేపట్టాల్సి ఉంది. ఇదే సమయంలో అధికార మార్పిడి కోసం సైన్యం , పౌర నేతల మధ్యవివాదాలు మొదలయ్యా యి. దీంతో గతనెలలో సైన్యం తిరుగుబాటు చేయాలని ప్రయత్నిం చినప్ప టికీ అది విఫలమయ్యిం ది. దీంతో సైన్యం కొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తోంది.

  ఏం జ‌రిగింది..
  సుడాన్ (Sudan)లో సైన్యం పూర్తి ప‌ట్టు సాధిస్తోంది. దేశంలో చెల‌రేగిన తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. ఆ దేశ ప్రధాన మంత్రి అబ్దుల్లా హమ్‌డాక్ (Prime Minister Abdalla Hamdok)ను సైన్యం గృహ నిర్భంధంలో ఉంచింది. అయితే ఆయన ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని అక్క డి సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటిం చిం ది. ఆయ‌న‌తోపాటు సైన్యం త‌మ‌కు వ్య‌తిరేఖంగా ఉన్న అనేకమంది సీనియర్ అధికారులను, గృష నిర్బంధంలో లేదా అరెస్ట్ (Arrest) చేశారు. తమకు మద్దతుగా ప్రకటన చేయాలని ప్రధానిని సైన్యం ఒత్తిడి చేస్తోందని ఆ దేశ సమాచార మంత్రిత్వశాఖ (Ministry of Information) ట్వీట్ చేసింది. అంతే కాకుండా సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని దేశంలోని ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో ఆదేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు.
  Published by:Sharath Chandra
  First published: