ఒక్క నంబర్ తేడాతో సెక్స్ హాట్‌లైన్‌కి వెళ్లిన కాల్స్...

One Digit Mistake : ఫోన్ నంబర్లతో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటును ఒకరికి చెయ్యబోయి, మరొకరికి చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ విద్యార్థుల విషయంలో అదే జరిగింది. ఏమైందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 2, 2019, 7:54 AM IST
ఒక్క నంబర్ తేడాతో సెక్స్ హాట్‌లైన్‌కి వెళ్లిన కాల్స్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
California : "హలో సూసైడ్‌ను అడ్డుకోవడం ఎలా?" అని అడగ్గానే... "చెప్పండి మీకు ఎలాంటి ఫిగర్ కావాలి? ఎంత రేటులో కావాలి? ఎంత టైమ్ కావాలి?" ఇలా అడుగుతుంటే... షాకయ్యారు విద్యార్థులు. అసలేమైందంటే... అమెరికా కాలిఫోర్నియాలో అది న్యూ విస్టా మిడిల్ స్కూలు. అక్కడి విద్యార్థులకు ఐడీ కార్డులతో బ్యాడ్జ్‌లు ఇచ్చారు. ఐతే... అమెరికాలో చాలా మంది విద్యార్థులు సూసైడ్లు చేసుకుంటుండటంతో... ఆ స్కూల్ అధికారులు అప్రమత్తమై... మీకెప్పుడైనా సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తే... ముందు ఈ నంబర్‌కి కాల్ చెయ్యండి అని ఆ మొబైల్ నంబర్‌ను బాడ్జిల వెనకవైపు ముద్రించారు. కొత్త బ్యాడ్జీలు తీసుకున్న విద్యార్థులు, విద్యార్థినులు... అసలా సూసైడ్ నంబర్ పనిచేస్తోందో లేదో తెలుసుకుందామని సరదాగా కాల్స్ చేశారు. ఎవరు కాల్ చేసినా... ఆ నంబర్... సెక్స్ హాట్‌లైన్‌కి వెళ్తోంది. అవతలి నుంచీ సెక్స్ వర్కర్ల బ్రోకర్లు డీల్స్ మాట్లాడుతున్నారు. దాంతో షాకవ్వడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వంతైంది.

నిజంగా సూసైడ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు... ఆ సమయంలో... ఇలాంటి కాల్ చేస్తే... అటు నుంచీ వచ్చే రిప్లైలకు వాళ్లు మరింత ఆందోళన చెందుతారనీ, సూసైడ్ చేసుకుంటారని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాడ్జిలపై నంబర్లు ముద్రించేటప్పుడు చూసుకునే పనిలేదా అని ప్రశ్నిస్తున్నారు.

విషయం స్కూల్ అధికారులకు తెలిసింది. ఏమై ఉంటుందా అని చూస్తే... వారు బ్యాడ్జిలపై ముద్రించిన ఫోన్ నంబర్‌లో ఒక సంఖ్య తేడాగా ముద్రించినట్లు తెలుసుకున్నారు. అది సెక్స్ హాట్ లైన్ నంబర్ కావడంతో... కాల్స్ అన్నీ అక్కడకు వెళ్తున్నట్లు గ్రహించారు. వెంటనే బ్యాడ్జిలన్నీ వెనక్కి తీసుకున్నారు. త్వరలో అసలైన నంబర్ ముద్రించి... తిరిగి విద్యార్థులకు ఇస్తామంటున్నారు. ఇంతకీ ఎంత మంది విద్యార్థులు ఆ రాంగ్ నంబర్ సేవ్ చేసుకున్నారో ఏమో...!!

 

ఒయ్యారాల విందు చేస్తున్న అనుపమ ఫోటో షూట్

ఇవి కూడా చదవండి :కుక్క కోసం యువతి సూసైడ్... షాకైన కుటుంబ సభ్యులు

కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు... అమెరికాకు కొత్త టెన్షన్


ఆర్టీసీపై నేడు కేసీఆర్ తుది నిర్ణయం? కేబినెట్ మీట్‌లో ఏం చర్చిస్తారు?

Health Tips : పీచ్ ఫ్రూట్ తింటున్నారా... మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...


టైమ్ ట్రావెల్ సాధ్యమేనా... రియల్ ఆధారాలు ఇవిగో....
First published: November 2, 2019, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading