కరోనా మహమ్మారి చాలా మంది జనాల జీవనశైలిని చాలా వరకు మార్చేసింది. చాలా కొత్త విషయాలకు అలవాటు పడాల్సి వస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్ వంటి కొత్త అంశాలు రోజువారి జీవనంలో భాగమై పోయాయి. ఇప్పుడు అవి సాధారణంగా మారాయి. అయితే ఆన్లైన్ క్లాసుల సమయంలో చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు షాకింగ్‌గా ఉంటున్నాయి. వియత్నాంలో చోటుచేసుకున్న అలాంటి ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ విద్యార్థి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించే సమయానికి తన పాట్నర్‌తో కలిసి శృంగారం చేస్తూ కనిపించాడు. కెమెరాలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొన్న ఇతరులు చూసేశారు. ఈ ఘటన వియత్నాంలోని హో చి మిన్హ్ నగరంలో చోటుచేసుకుంది.
అక్కడి మీడియా ప్రకారం.. వియత్నాంలోని ఓ యూనివర్సిటికి చెందిన విద్యార్థి ఆన్లైన్ క్లాసుకు హాజరు కావాల్సి ఉంది. ఈలోగా విద్యార్థి తన పాట్నర్‌తో శృంగారం చేయడం ప్రారంభించాడు. అయితే అతడు ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన కెమెరాను ఆపివేయడం మరిచిపోయాడు. దీంతో కెమెరా ముందు అతడు చేస్తున్న దృశ్యాలను అతడి ప్రొఫెసర్‌తో పాటు ఇతర విద్యార్థులు చూడగలిగారు. ఈ చర్యతో అతడి ప్రొఫెసర్ షాక్ తిన్నారు. పాఠశాలలు, కళాశాలలలో.. అబ్బాయిలు తమ స్నేహితురాళ్ళతో కలిసి తిరిగేవారు.. కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతోందని ప్రొఫెసర్ అన్నారు.
అయితే దీనిని కొందరు రికార్డు చేయడంతో.. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక, అతడు తన పనిలో నిమగ్నమై ఉండటం, కెమెరా ఆన్ చేసిన విషయం తెలియకోవడం వల్ల.. అతను చేస్తున్న పనిని అందరూ చూస్తున్న విషయాన్ని విద్యార్థి గుర్తించలేదు. చివరకు ప్రొఫెసర్ గట్టిగా కేకలు వేయడంతో.. అతడు కెమెరా ఆపివేసి.. దుస్తులు ధరించేందుకు వెళ్లాడు. ఈ ఘటన అనంతరం ఆ విద్యార్థి.. తన ప్రొఫెసర్‌కు, క్లాస్‌మేట్స్‌కు క్షమాపణ కొరుతూ లేఖ పంపినట్టు వియత్నాం మీడియా కథనాలు ప్రచురించింది. ఈ ఘటన తర్వాత.. ఆన్లైన్ తరగతులు సమయంలో విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలని యూనివర్సిటీ సూచనలు జారీచేసింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.