Home /News /international /

STRONG EARTHQUAKE IN INDONESIA PVN

Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Indonesia Earthquake: వెస్ట్ సుమత్రా ఫ్రావిన్స్ రాజధాని పడాంగ్ కు 197 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనాల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు.

6.7 Magnitude Strong Quake : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశంలోని సుమత్రా ద్వీపంలో సోమవారం తెల్లవారుజామున 4:06గంటల సమయంలో భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్​ స్కేలుపై 6.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 21 కి.మీ తోతులో..వెస్ట్ సుమత్రా ఫ్రావిన్స్ రాజధాని పడాంగ్ కు 197 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భవనాల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం,ఆస్తినష్టం జరగలేదని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరోవైపు,ఫిలిప్పిన్స్​లో కూడా భారీ భూకంపం సంభవించింది. ఆదివారం అర్థరాత్రి మనీలా నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో భూకంపం తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన నేషనల్​ సెంటర్​ ఫర్​ సెసిమాలజీ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Earthquake, Indonesia

తదుపరి వార్తలు