షాపు నడుపుతున్న కుక్క... దాని తెలివి తేటలు మామూలుగా లేవుగా...

Strange News : జపాన్ ప్రజలు కుక్కలు, పిల్లులు ఇతర జంతువులతో పనులు చేయిస్తారు. ఈ కుక్క కూడా అలా ట్రైనింగ్ పొందినదే.

Krishna Kumar N | news18-telugu
Updated: March 31, 2019, 3:02 PM IST
షాపు నడుపుతున్న కుక్క... దాని తెలివి తేటలు మామూలుగా లేవుగా...
జపాన్‌లో వ్యాపారం చేస్తున్న కుక్క
Krishna Kumar N | news18-telugu
Updated: March 31, 2019, 3:02 PM IST
ఈ కుక్క బలే ఉంది కదా. షాపులో ఉండి... దిక్కులు చూస్తూ... కస్టమర్ ఎవరు వస్తారా అని ఎదురుచూస్తోంది. జపాన్‌లోని హక్కాయ్‌డోలో ఇది ఈ షాపును సొంతంగా నడుపుతోంది. ఈ దుకాణానికి ఇంకెవరూ ఓనర్లు లేరు. ఇదే ఓనర్. ఇంతకీ ఈ షాపులో ఈ కుక్క ఏం అమ్ముతుందంటే... చిలకడ దుంపలు. అసలు కుక్కేంటి... షాపు నడపడమేంటని మనకు ఆశ్చర్యం కలగవచ్చు. సరుకైతే మనం తీసుకోవచ్చు... కుక్క డబ్బులెలా తీసుకుంటుంది అన్న డౌట్ మనకు కలగవచ్చు. ఇదేదో ఏప్రిల్ ఫూల్ కహానీ కాదు. అక్షరాలా నిజం. ఈ కుక్కకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

మూడేళ్ల ఈ కుక్క పేరు కెన్-కున్. స్థానికులు ఈ కుక్క దగ్గరకు వచ్చి... డబ్బులిచ్చి... చిలకడ దుంపలు తీసుకుంటారు. ఇదంతా జరుగుతున్నప్పుడు... ఈ కుక్క ఏమీ చెయ్యదు. అలా చూస్తూ ఉంటుంది. కూనిరాగాలు తీస్తుంది.

Strange News | Strange News Dog maintains a shop in japan | జపాన్ ప్రజలు కుక్కలు, పిల్లులు ఇతర జంతువులతో పనులు చేయిస్తారు. ఈ కుక్క కూడా అలా ట్రైనింగ్ పొందినదే.
జపాన్‌లో వ్యాపారం చేస్తున్న కుక్క


షాపు దగ్గరకు వచ్చిన కస్టమర్... తనకు కావాల్సిన చిలకడ దుంపలు తీసుకుంటారు. తర్వాత వాటికి ఇంతని డబ్బులు లెక్కగట్టి... వాళ్లే అక్కడున్న పెట్టలో వేస్తారు. అవి చిలకడ దుంపలు కొనుక్కున్నందుకు. ఆ డబ్బుతోపాటూ... కుక్క కోసం కూడా విడిగా కొన్ని డబ్బులు ఇస్తారు. అలా బిజినెస్ జరుగుతుందన్న మాట.Strange News | Strange News Dog maintains a shop in japan | జపాన్ ప్రజలు కుక్కలు, పిల్లులు ఇతర జంతువులతో పనులు చేయిస్తారు. ఈ కుక్క కూడా అలా ట్రైనింగ్ పొందినదే.
జపాన్‌లో వ్యాపారం చేస్తున్న కుక్క


కెన్-కున్ ఈ షాపులో రోజంతా ఉంటుంది. సాయంత్రం కాగానే దీన్ని పెంచుకుంటున్న ఓనర్ వచ్చి... షాపు మూసేస్తాడు. కుక్క డబ్బులు కుక్క పేరున ఉంచుతాడు. కుక్కను షికారుకు తీసుకెళ్తాడు.

Strange News | Strange News Dog maintains a shop in japan | జపాన్ ప్రజలు కుక్కలు, పిల్లులు ఇతర జంతువులతో పనులు చేయిస్తారు. ఈ కుక్క కూడా అలా ట్రైనింగ్ పొందినదే.
జపాన్‌లో వ్యాపారం చేస్తున్న కుక్క


తెల్లారి కుక్కను తీసుకొచ్చి... షాపు తెరిచి... దాన్ని అందులో వుంచి... మళ్లీ చిలకడ దుంపలను సిద్ధం చేసి వెళ్లిపోతాడు దీని ఓనర్. ఇలా రోజూ జరుగుతుందన్న మాట. ఇలా బుద్ధిగా బిజినెస్ చేసుకుంటున్న కెన్-కున్‌ను మెచ్చుకోకుండా ఎలా ఉండగలమా.


ఇవి కూడా చదవండి :

మంగళగిరి వైపు పవన్ కన్నెత్తి కూడా చూడట్లేదు.. కారణమదే : జీవీఎల్

చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం... పులివెందుల ప్రజల ఆగ్రహం

మోదీ ధనవంతులకు దోచిపెట్టారు... ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్సే... విజయవాడలో రాహుల్ ప్రచారం
First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...