Home /News /international /

STRANGE LOVE STORY IN FLORIDA MAN PROPOSES TO GIRLFRIEND WITH ENGAGEMENT RING STOLEN FROM ANOTHER LOVER KRS

లవర్​ నుంచి రింగ్ కొట్టేసి ఇంకో అమ్మాయికి ప్రపోజ్​.. ఎలా బయటపడిందంటే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనతో ఎంగేజ్​మెంట్ అయిన లవర్​ (Lover) వద్ద ఉంగరం (Ring), ఆభరణాలు ఇచ్చి మరో గర్ల్​ఫ్రెండ్​ (Girl Friend)కు ప్రపోజ్ చేశాడు ఓ యువకుడు. అసలు ఈ విషయం ఎలా బయటపడిందంటే..

    నచ్చిన వ్యక్తికి తమ ప్రేమను చెప్పేందుకు ఎంతో వేచిచూస్తారు. చాలా మంది గిఫ్ట్​లు, సర్​ప్రైజ్​లను ప్లాన్ చేస్తుంటారు. ఎలాగైనా నచ్చిన వ్యక్తి మనసు దోచేయాలని ఆరాటపడుతుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం తన గర్ల్​ఫ్రెండ్​కు వింతైన బహుమతి ఇచ్చాడు. ఇంతకు ముందే తనతో ఎంగేజ్​మెంట్​ అయిన లవర్ నుంచి ఉంగరాన్ని దొంగలించిన తనకు నచ్చిన ఇంకో గర్ల్​ఫ్రెండ్​కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇది జరిగింది. ఈ ఘన కార్యం చేసిన వ్యక్తి జోసెఫ్ డేవిస్​.

    డేవిస్​తో ఎంగేజ్​మెంట్ అయిన ఆరెంజ్ సిటీకి చెందిన ప్రియురాలు అతడి ఫేస్​బుక్ పేజ్ చూడడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఓ ఫొటోలో తనకు కాబోయే వాడు, అతడి మరో ప్రేయసి ఉన్న దృశ్యం చూసింది. ఆ అమ్మాయి చేతికి తాను ప్రత్యేకంగా చేయించుకున్న రింగ్ ఉండడాన్ని చూసింది. వెంటనే తన జ్యూవెలరీ బాక్స్​ను తీసింది. అందులో రింగ్​తో పాటు తన బామ్మకు చెందిన డైమండ్ రింగ్ కూడా కనిపించలేదు. వీటి విలువ సుమారు 6,270 డాలర్లు.

    ఆ తర్వాత ఆమె వెంటనే తనకు కాబోయే భర్త వద్దకు వెళ్లి నిలదీసింది. అయితే తాను కొట్టేసిన కొన్ని వస్తువుల్లో కొన్నింటిని అతడు తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు అతడిని వదిలేశారు.

    కాగా డేవిడ్ తనకు కాబోయే భార్యను ఓ ఇంటికి తీసుకెళ్లి ఆ రింగ్​, జ్యువెలరీ తనవేనని వాదించాడు. తనతోనే ఉండాలని ఆమెను కోరాడు కానీ మళ్లీ వెళ్లిపోయాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అతడి ఎడమ చేతికి ఉన్న టాటూనే. ఓన్లీ గా

    డ్ కన్​ జడ్జ్​ మీ అని అతడు చేతిలో పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. దేవుడు మాత్రమే తన గురించి జడ్జ్ చేయగలడు అని రాసుకున్నాడు.

    రింగ్ సహా ఆ ఆభరణాలు పోయాయని ఎంగేజ్​మెంట్ అయిన మహిళ ఈ ఏడాది ప్రారంభంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు.. ఇలా బయటపడింది.
    Published by:Krishna P
    First published:

    Tags: Love

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు