దిష్టి బొమ్మల చరిత్ర తెలుసా... నమ్మలేని ఆసక్తికర నిజాలెన్నో...

Scarecrows Facts : దిష్టి బొమ్మలు తయారు చెయ్యడం చాలా తేలిక. నిజానికి వాటి వెనక ఆసక్తికర చరిత్ర ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 8, 2019, 2:14 PM IST
దిష్టి బొమ్మల చరిత్ర తెలుసా... నమ్మలేని ఆసక్తికర నిజాలెన్నో...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: March 8, 2019, 2:14 PM IST
మీరు ఏదైనా ప్రత్యేకమైన, పురాతనమైన బొమ్మ తయారు చెయ్యాలనుకుంటే... దిష్టి బొమ్మ మీకు సరిగ్గా సెట్టయ్యే ఐడియా అవుతుంది. ఇలా ఎందుకంటున్నానో తెలియాలంటే దిష్టి బొమ్మలకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకర విషయాలు మీకు తెలియాలి. దిష్టి బొమ్మలను మన దేశంలో ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు దిష్టి తగలకుండా ఏర్పాటు చేస్తారు. అదే పొలాల్లో అయితే, పక్షులు రాకుండా ఏర్పాటుచేస్తారు. ఎందుకంటే పక్షులు పురుగుల్ని మాత్రమే ఎత్తుకెళ్లవు. పంటల్ని పాడు చేస్తాయి కూడా. ముఖ్యంగా విదేశాల్లో కాకుల బెడద ఎక్కువ. వాటిని భయపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నవే దిష్టి బొమ్మలు. అందుకే ఇంగ్లీష్‌లో వాటిని స్కేర్ క్రౌస్ (Scarecrows) అని పిలుస్తున్నారు.

* మొదటి దిష్టిబొమ్మ 3,000 ఏళ్ల కిందటే తయారైంది.

* ఈజిఫ్షియన్లు నైలూ నది పక్కనున్న గోధుమ తోటల్ని కాపాడుకునేందుకు దిష్టి బొమ్మల్ని తయారుచేశారు.

* కాలక్రమంలో స్కేర్ క్రౌస్ బదులు... పక్షుల్ని తరిమేందుకు విండ్ మిల్స్ ఏర్పాటుచేస్తున్నారు.* పక్షులు తెలివైనవి. విండ్ మిల్స్ లాంటి వాటికి ఈజీగా అలవాటు పడగలవు.

* చెట్లకు బాటిళ్లు, టిన్స్ వంటివి వేలాడ దీస్తున్నారు. ఇంకొందరు ధ్వని వచ్చే గన్స్ వేలాడ దీస్తున్నారు. మొదట బయపడినా తర్వాత పక్షులు వాటికి అలవాటు పడిపోతున్నాయి.

* గ్రీకు రైతులు... ప్రియాపస్ దిష్టి బొమ్మను తయారుచేసేవాళ్లు. ప్రియాపస్ అనే వ్యక్తి చూసేందుకు వికృతాకారంలో కనిపించేవాడు. అందుకే అతని ఆకారంలో దిష్టిబొమ్మలు పెట్టేవారు.

* కొంతమంది దిష్టి బొమ్మలకు అత్యంత చెడు వాసన వచ్చే డ్రెస్ వేసేవారు. తద్వారా ఆ వాసన భరించలేక పక్షులు ఆ చుట్టుపక్కలకు వచ్చేవి కావు.

* జపాన్ రైతులు ఒకప్పుడు స్కేర్ క్రౌస్‌ని ఏర్పాటు చేసేవాళ్లు. ఇందుకోసం కుళ్లిన మాంసం, చేపల కుళ్లిన ఎముకల్ని వేలాడ దీసేవాళ్లు. ఆ వాసన భరించలేక పక్షులు పారిపోయేవి.

* జర్మనీ ప్రజలు చెక్కలతో తయారైన దిష్టిబొమ్మల్ని పెట్టేవారు.

* ప్రపంచంలో ఏటా డజన్ల కొద్దీ దిష్టిబొమ్మల పండుగలు జరుగుతున్నాయి. వాటిలో చాలా వరకూ బ్రిటన్‌లో జరుపుతున్నారు.

* స్కేర్ క్రౌ పదాన్ని 1719లో తొలిసారి డేనియల్ డిఫో తన నవల రాబిన్సన్ క్రూసోలో వాడారు.

* మధ్య యుగంలో బ్రిటన్‌లో పక్షుల్ని తరిమేవారుండేవారు. వాళ్లు సంచుల నిండా రాళ్లు నింపుకొని పక్షులు రాకుండా అడ్డుకునేవారు.

* ప్లేగ్ వ్యాధి రావడంతో చాలా మంది చనిపోయారు. దాంతో పక్షుల్ని తరిమేవారికి కొరత ఏర్పడింది. అప్పుడు రైతులు దిష్టిబొమ్మలు ఏర్పాటు చెయ్యడం మొదలుపెట్టారు.

* క్రీ.శ.712లో ఓ జపాన్ బుక్‌లో క్యూబికో అనే దిష్టిబొమ్మ ఉండేది. అది దైవంతో సమానమైనది. అది నడవలేదు గానీ... ప్రపంచంలో ఏం జరుగుతుందో అంతా దానికి తెలుసు.

* ప్రపంచవ్యాప్తంగా దిష్టిబొమ్మలను హాడ్మెడాడ్, హే మేన్, గల్లీ బగ్గెర్, టాట్టీ బోగల్, బ్వాచ్ వంటి పేర్లతో పిలుస్తున్నారు.

* జపాన్‌లోని నాగోరో గ్రామంలో 35 మంది నివసిస్తున్నారు. అక్కడ 350 దిష్టిబొమ్మలున్నాయి.

* కెనడాలో జాయ్స్ స్కేర్ క్రౌ గ్రామం ఉంది. ఇక్కడ డజన్ల కొద్దీ దిష్టిబొమ్మలున్నాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు.

* ప్రపంచంలో ఎక్కువ దిష్టిబొమ్మల్ని ఒక చోటకు తెచ్చినది బ్రిటన్‌లోని నేషనల్ ఫారెస్ట్ అడ్వెంచర్ ఫామ్‌లో. మొత్తం 3,812 స్కేర్ క్రౌస్. అదో వరల్డ్ రికార్డ్.

 

ఇవి కూడా చదవండి :

ఆ గ్రహశకలంపై 20,00,000 కేజీల బంగారం ఉందన్న నాసా... ఫ్యూచర్‌లో తవ్వేస్తారా....

అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...

ఒక్కోటీ ఒక్కో వింత వెబ్ సైట్ ... ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేం

మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ తయారీ... సింపుల్‌గా ఎలా... ఇలా చెయ్యండి
First published: March 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...