గాల్లో ఎగురుతున్న విమానం నుంచి కిందపడ్డ మృతదేహం..

కెన్యా ఎయిర్‌వేస్ నుంచే డెడ్ బాడీ పడిందని నిర్దారించడంతో నైరోబీ విమానాశ్రయంలో భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. తాజా ఘటనపై విచారణ జరిపిస్తున్నామని కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ తెలిపింది.

news18-telugu
Updated: July 2, 2019, 7:57 PM IST
గాల్లో ఎగురుతున్న విమానం నుంచి కిందపడ్డ మృతదేహం..
కెన్యా ఎయిర్‌వేస్(Image : Reuters)
  • Share this:
గాల్లో ఎగురుతున్న విమానం నుంచి ఓ డెడ్‌బాడీ కింద పడటం లండన్‌లో కలకలం రేపింది.నైరోబికి చెందిన కెన్యా ఎయిర్‌వేస్ KQ 100 లండన్ మీదుగా ప్రయాణిస్తుండగా.. అందులో నుంచి ఓ డెడ్‌బాడీ పడిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మృతదేహం పడ్డ చోటుకు ఒక మీటరు దూరంలో
తాను సన్ బాత్ చేస్తున్నానని చెప్పాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించిందని.. మృతదేహంపై ఉన్న రక్తపు మరకలు తాను సన్ బాత్ చేస్తున్న గార్డెన్ గోడలపై కూడా పడ్డాయని తెలిపాడు. ఆ మృతదేహం పడటానికి కొద్ది సెకన్ల ముందే.. ఆ గార్డెన్‌లో ఉన్న చాలామంది వెళ్లిపోయారని, లేదంటే అది వారిపై పడి ఉండేదని అన్నాడు.కెన్యా ఎయిర్‌వేస్ నుంచే డెడ్ బాడీ పడిందని నిర్దారించడంతో నైరోబీ విమానాశ్రయంలో భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. తాజా ఘటనపై విచారణ జరిపిస్తున్నామని కెన్యా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ తెలిపింది.First published: July 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>