హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

OMG : అమెరికాలో విమానం క్రాష్ ల్యాండ్

OMG : అమెరికాలో విమానం క్రాష్ ల్యాండ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోలీసులు వాల్‌మార్ట్‌ స్టోర్‌ సహా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించారు. అన్ని క్లియర్ అయ్యే వరకు ఆ ప్రాంతానికి దూరంగా ఉండమని పౌరులను టుపేలో పోలీస్ డిపార్ట్‌మెంట్ కోరింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Plane crash land : అమెరికా(USAలోని టుపేలో(Tupelo)ఎయిర్ పోర్ట్ లో పనిచేసే ఓ ఉద్యోగి శనివారం ఉదయం ఓ విమానాన్ని దొంగలించి టుపేలో(Tupelo)లో నగరంలోని వాల్‌మార్ట్ స్టోర్‌(Wallmart Store) పై విమానాన్ని క్రాష్(Plane Crash) చేస్తానని బెదిరించాడు. టుపెలో విమానాశ్రయం నుంచి బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90 అనే చిన్న విమానాన్ని పైలట్ దొంగిలించినట్లు సమాచారం. ఇది రెండు ఇంజన్లతో కలిగిన తొమ్మిది సీట్ల ఎయిర్ క్రాఫ్ట్. విమానం దొంగలించిన అతడు..విమానంతో వాల్ మార్ట్ స్టోర్‌ చుట్టూ ఆకాశంలో చక్కర్లు కొడుతూ విమానాన్ని స్టోర్ పై కూల్చేస్తానంటూ చేసిన బెదిరింపులతో వాల్‌మార్ట్ స్టోర్‌ లోని కస్టమర్లను,ఉద్యోగులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు టుపేలో పోలీస్ డిపార్ట్మెంట్(TPD)తెలిపింది. పోలీసులు వాల్‌మార్ట్‌ స్టోర్‌ సహా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించారు. అన్ని క్లియర్ అయ్యే వరకు ఆ ప్రాంతానికి దూరంగా ఉండమని పౌరులను టుపేలో పోలీస్ డిపార్ట్‌మెంట్ కోరింది.

అయితే తాజాగా ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఆష్‌లాండ్‌కు నైరుతి ప్రాంతంలో విమానం క్రాష్ ల్యాండ్ అయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పైలట్ ను అరెస్ట్ చేశారు. పోలీసులు పైలట్‌ ని విచారిస్తున్నారు. విమానం దొంగలించి క్రాష్ చేయడంపై అతడి ఉద్దేశ్యం ఏంటన్నది తెలుసుకునేపనిలో ఉన్నారు.

వీడెవడండీ బాబు : KGF చూసి ఫేమస్ అయ్యేందుకు 4గురిని హత్య చేశాడు

అంతకుముందు,శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో విమానం టుపేలోలో చక్కర్లుకొడుతూ కనిపించిందని ఫేస్ బుక్ లో పోలీసులు తెలిపారు. E911తో కాంటాక్ట్ అయిన పైలట్..తాను విమానాన్ని వెస్ట్ మెయిన్ లో ఉన్న వాల్ మార్ట్ పై క్రాష్ చేస్తాను అని బెదిరించాడని ఫేస్ బుక్ లో తెలిపారు. బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 90 విమానాన్ని ఉద్దేశపూర్వకంగా క్రాష్ చేస్తానని బెదిరిస్తున్న పైలట్‌ను నేరుగా సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. అన్ని క్లియర్ అయ్యే వరకు పౌరులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. TPD,ఆ ప్రాంతంలోని అన్ని అత్యవసర సేవల విభాగాలు హై అలర్ట్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. "స్టేట్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ మేనేజర్స్ ఈ ప్రమాదకరమైన పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు" అని గవర్నర్ టేట్ రీవ్ ట్విట్టర్‌లో తెలిపారు. "పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి, టుపెలో పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చే అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవాలి"అని గవర్నర్ కోరారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Plane Crash, USA

ఉత్తమ కథలు