Home /News /international /

SRILANKA TERROR ATTACK ANOTHER EXPLOSION HAS JUST GONE OFF NEAR ST ANTHONYS CHURCH IN COLOMBO SK

శ్రీలంకలో మరో పేలుడు...కొలంబోలో బాంబుల మోత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

    శ్రీలంక రాజధాని కొలంబో బాంబుల మోతతో దద్ధరిల్లుతోంది. దేశవ్యాప్తంగా మరిన్ని పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రలు చేశారు. కొలంబో వ్యాప్తంగా పోలీసులు, ఆర్మీ ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంథోనిస్ చర్చి సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది బాంబులను నిర్వీర్యం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.


    అంతకముందు కొలంబోలోని ప్రధాన బస్టాండ్‌లో 87 బాంబ్ డిటోనేటర్లను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. వరుస పేలుళ్ల నేపథ్యంలో దేశంలో నిరవధిక అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. అర్ధరాత్రి నుంచే ఇది అమల్లోకి రానుంది.


    First published:

    Tags: Sri Lanka, Sri Lanka Blasts

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు