హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఆ దేశంలో మహిళలు బుర్ఖా ధరించడం ఇకపై బ్యాన్...ఎందుకో తెలుసా ?

ఆ దేశంలో మహిళలు బుర్ఖా ధరించడం ఇకపై బ్యాన్...ఎందుకో తెలుసా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శ్రీలంకలో ఎక్కడికక్కడ అనుమానితులను అరెస్టు చేస్తూ విచారణను వేగవంతం చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ భద్రతాకారణాల దృష్ట్యా మహిళలు బుర్ఖా ధరించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

    ఈస్టర్ పర్వదినాన ఐసీస్ ఉగ్రవాదులు శ్రీలంకలో సృష్టించిన మారణహోమం నుంచి అక్కడి ప్రజలు, ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కాగా మరింత మంది మానవబాంబులు పొంచి ఉన్నారన్న సమాచారంతో శ్రీలంకలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు అక్కడి ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా దేశమంతటా అత్యవసర పరిస్థితి విధించింది. నలుగురు కలిసి రోడ్డు మీద నడవడం కూడా నిశేధించింది. ఇప్పటికే ప్రభుత్వం కార్యాలయాలు, బ్యాంకులు, కాలేజీలు మూతపడ్డాయి. అలాగే ఎక్కడికక్కడ అనుమానితులను అరెస్టు చేస్తూ విచారణను వేగవంతం చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ భద్రతాకారణాల దృష్ట్యా మహిళలు బుర్ఖా ధరించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఎమర్జన్సీ విధిస్తూ తీసుకున్న నిర్ణయాల్లో బుర్ఖా ధరించడంపై కూడా నిషేధం విధించారు.


    జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా పౌరులు ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని అధ్యక్షుడు కోరారు. ప్రతీ ఒక్కరూ తమ మొహం పూర్తిగా కనిపించేలా తిరగాలని, స్కార్ఫ్, మాస్క్ లాంటివి ధరించకూడదని, అప్పుడే ఆగంతకులను గుర్తించే వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శ్రీలంక పోలీసులు ఇప్పటికే ఐసీస్ స్థావరాలపై దాడులు చేసి అరెస్టులు చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 48 మందిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు అమెరికన్ ఎంబసీ మీద సైతం దాడుల జరిగే అవకాశం ఉందని తేలడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే శ్రీలంక జనాభాలో మొత్తం 20 లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు. అయితే బాంబు దాడులు జరిగినప్పటి నుంచి వీరిపై నిర్బంధం పెరిగిందని వాపోతున్నారు.

    First published:

    Tags: Sri Lanka, Sri Lanka Blasts

    ఉత్తమ కథలు