Home /News /international /

SRILANKA BLASTS SAVOY CINEMA EXPLOSION IN COLOMBO AFTER EASTER SUNDAY BLASTS MS

Srilanka Blasts : కొలంబోలో మరో పేలుడు.. థియేటర్‌ను టార్గెట్ చేసిన ఐసిస్

శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగిన ఓ ప్రాంతంలో చిత్రం(File)

శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగిన ఓ ప్రాంతంలో చిత్రం(File)

Srilanka Blasts : ఐసిస్ ఈసారి బహిరగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికన్ ఇంటలిజెన్స్ కూడా శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించింది. అమెరికన్ ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగానే.. ఈరోజు ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది. పేలుడు దృశ్యాలు సీసీటీవి కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

ఇంకా చదవండి ...
    ఈస్టర్ సండే నాటి మారణహోమాన్ని మరిచిపోకముందే.. మరిన్ని ఉగ్రదాడులతో విరుచుకుపడుతామన్న ఐసిస్ ప్రకటన శ్రీలంక ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఐసిస్ నుంచి ఆ ప్రకటన వచ్చిందో లేదో.. కొలంబోలో మరో బాంబు పేలుడు సంభవించింది. స్థానిక సవోయ్ థియేటర్ వద్ద డియో బైక్‌లో బాంబులు అమర్చి పేల్చివేశారు. అయితే పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బైక్ అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్నప్పటికీ.. ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం.

    ఐసిస్ ఈసారి బహిరగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికన్ ఇంటలిజెన్స్ కూడా శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించింది. అమెరికన్ ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగానే.. ఈరోజు ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది. పేలుడు దృశ్యాలు సీసీటీవి కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి మసీదుల్లో పేలుళ్లకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు జరిపినట్టు ఐసిస్ ప్రకటించింది.కాగా, ఈస్టర్ సండే నాడు జరిగిన 8 పేలుళ్లలో ఇప్పటివరకు దాదాపు 359మంది మృతి చెందారు. 500 పైచిలుకు మంది గాయపడ్డారు.
    First published:

    Tags: Sri Lanka Blasts, Terror attack, Terrorism

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు