శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య 290కి పెరిగింది. దాదాపు 500 పైచిలుకు మంది గాయపడ్డారు. స్థానిక పోలీస్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్టు 'రాయిటర్స్' కథనం తెలిపింది. శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో రెండు ఆత్మాహుతి దాడులు జరిగినట్టు ఇప్పటివరకు తేలింది. అందులో ఒకటి కొలంబోలోని సిన్నమాన్ గ్రాండ్ హోటల్ వద్ద జరిగింది. సిన్నమాన్ హోటల్లోకి ప్రవేశించిన సూసైడ్ బాంబర్.. బ్రేక్ ఫాస్ట్ బఫే కోసం క్యూ లైన్‌లో నిలుచుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీంతో సిన్నమాన్ హోటల్‌లో రక్తపుటేరులు పారాయి.
సిన్నమాన్ హోటల్‌తో పాటు, షాంగ్రీ-లా, కింగ్స్‌బరీ హోటల్స్ వద్ద కూడా పేలుళ్లు సంభవించాయి. హోటల్స్‌తో పాటు కొచ్చికడే, సెయింట్ సెబాస్టియన్, సెయింట్ ఆంటోని చర్చిల వద్ద కూడా పేలుళ్లు సంభవించాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పేలుళ్లలో 290 మంది మృతి చెందగా.. 500 పైచిలుకు మంది గాయపడ్డారు. మృతుల్లో 35మంది విదేశీయులు ఉన్నట్టు చెబుతున్నారు. విదేశీ మృతుల్లో అమెరికా, డెన్మార్క్, చైనా, జపాన్, పాకిస్తాన్, మొరాకో, ఇండియా, బంగ్లాదేశ్ వాసులు ఉన్నట్టు సమాచారం. పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 24మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి : SRILANKA BLASTS : పేలుళ్ల తర్వాత లంక ప్రజలు ఏమనుకుంటున్నారు..? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Columbo Bomb Blast, Sri Lanka, Terror attack, Terrorism