SRI LANKANS PROTEST OUTSIDE MAHINDA RAJAPAKSAS RESIDENCE AMID UNREST PAH
Sri lanka : మరోసారి రెచ్చిపోయిన నిరసన కారులు.. ప్రధాని మహీందా రాజపక్సే ఇంటి దగ్గర హైటెన్షన్..
నిరసన తెలుపుతున్న ఆందోళన కారులు
Economic Crisis: శ్రీలంకలో సంక్షోభం కొనసాగుతుంది. ఇప్పటికే ఆ దేశంలో పౌరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ప్రధాని మహీందా రాజపక్సే ఇంటి దగ్గర ఆందోళన కారులు బీభత్సం సృష్టించారు.
Sri Lankans protest outside Mahinda Rajapaksas residence: శ్రీలంకలో ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభం మరింత తీవ్రతరమైంది. సైన్యం, పోలీసులు చేతిలో ఉన్నా దేశాన్ని నడపలేని నిస్సహాయ స్థితిలో పాలకులు ఉంటే.. కనీస అవసరాలకు సరుకులు దొరక్క సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఇప్పటికే ప్రజలు అధ్యక్షుడు గొటబయా రాజపక్సే ఇంటిని ముట్టడికి ప్రయత్నించారు.
తాజాగా, ప్రధాని మహీందా రాజపక్సే ఇంటి ముందు నిరసన కారులు బీభత్సం చేశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకనోక సమయంలో ఆందోళన కారులు పోలీసులను, బారికేడ్లను తోసేసి ముందుకు దూసుకొని వచ్చారు. శ్రీలంకలో కొంతకాలంగా నెలకొన్న ఆహార, ఆర్ధిక సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటాయి. కాగితం కొరతతో పరీక్షలు వాయిదాపడ్డాయి. నిల్వలు అయిపోవడంతో డీజిల్ విక్రయాలు నిలిపేశారు. ఉత్పత్తి లేక రోజుకు 13 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
లంక తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాలకు తీవ్రంగా కొరత ఏర్పడటం, ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కేజీ బియ్యం ధర మన కరెన్సీలో రూ.220కాగా, గోధుమల ధర రూ.190కి చేరింది. చక్కెర కేజీ రూ.240, కొబ్బరి నూనె లీటరు ధర రూ.850, ఒక కోడిగుడ్డు రూ.30, కేజీ మిల్క్ పౌడర్ ధర రూ.1,900గా ఉంది. కల్లోల శ్రీలంకకు భారత్ భారీ సహాయాన్ని అందిస్తున్నది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని, వేల క్వింటాల బియ్యాన్ని పంపింది. మరోవైపు... కొలంబోకు విమానాల రాకపోకలను తగ్గించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీ, చెన్నై నుంచి కొలంబోకు వారంలో 16 సర్వీసులు తిరుగుతున్నాయి.
వందలాది మంది విద్యార్థులు గురువారం కొలంబోలోని ప్రధాని నివాసం దగ్గరకు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు స్థానిక పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.