శ్రీలంక పౌరుడిని కిరాతకంగా కొట్టి చంపిన ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. దీనిపై శ్రీలంక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంక ప్రభుత్వం పాక్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ..ఇలాంటి ఘటనలు జరగడంపై ఆందోళన (Sri Lanka Shocked) చెందుతోంది. దాడి చేసి చంపిన నేరస్థులను వెంటనే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరింది. శ్రీలంకకు చెందిన 40 ఏళ్ల ప్రియాంత దియవదన కుమార్ పాక్ లోని సియాల్ కోట్ లోని రాజ్ కో ఇండస్ట్రీస్ గార్మెంట్ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజరుగా చేస్తున్నారు. దేవుణ్ని దూషించాడనే ఆరోపణలతో వందలాది మంది మతోన్మాదుల గుంపు అతని కర్మాగారం వెలుపల దారుణంగా దాడి చేసి, చిత్రహింసలు గురిచేసి, కాల్చి చంపారు. ఇటీవల వరకు నిషేధంలో ఉన్న ఉగ్రవాద మతోన్మాద సంస్థ గార్మెంట్ ఫ్యాక్టరీ గోడకు అంటించిన పోస్టర్ ను చించివేశాడని దీంతో దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. ఆ పోస్టర్ పై ఖురాన్ ముద్రించారని దాన్ని తొలగించి చింపి, చెత్తబుట్టలో పడేసి దైవదూషణకు పాల్పడ్డారని టెహ్రీక్ ఇ లబ్బైక్ (Tehrik E labbain) అనే ఉగ్రవాద సంస్థ తెలిపింది.
పోస్టర్ చింపివేసినట్టు వార్తలు చుట్టుపక్కల దావానంలా వ్యాపించాయి. కొన్ని నిమిషాల్లోనే, వందలాది మతవాదుల గుంపు అతని కర్మాగారాన్ని చుట్టుముట్టి తీవ్రంగా కొట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే అతన్ని కొట్టి చంపారు. అతని మృతదేహాన్ని కూడా కాల్చిపడేశారు.ఈ భయంకరమైన వార్త కొలంబో తీవ్రంగా పరిగణించింది. త్వరితగతిన న్యాయ చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయానికి శ్రీలంక ప్రభుత్వం కాల్ చేసింది.
Deeply concerned by the incident in Sialkot #Pakistan. #SriLanka trusts that PM @ImranKhanPTI and the Gvt. of Pakistan will ensure justice is served and ensure the safety of the remaining Sri Lankan workers in Pakistan.
— Gotabaya Rajapaksa (@GotabayaR) December 4, 2021
వెంటనే ఇమ్రాన్ ఖాన్ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరిని విడిచిపెట్టబోమని హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పాకిస్తాన్ లో వందలాది మంది లంకేయులు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. ఈ ఘటతో ఇప్పుడు వారు, వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
నిందితులపై కఠిన చర్యలుంటాయన్న పాక్ ప్రధాని..
‘‘మేము నమ్మలేక పోతున్నాం, షాక్ కు గురయ్యాం. పాకిస్తాన్ లో శ్రీలంక దేశీయుడిని చంపుతారని మేం ఊహించలేదు. పెరుగుతున్న మత ఛాందసవాదం మనకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి ఘటనలు రెండు దేశాల మధ్య సత్సంబంధాలను ప్రభావితం చేస్తాయి. స్వాతంత్రంవచ్చినప్పటి నుంచి పాకిస్థాన్ పొరుగుదేశాలపట్ల స్నేహబావంతో ఉన్నాం.’’ అని శ్రీలంక సీనియర్ దౌత్యవేత్త ఒకరు అభిప్రాయడ్డారు.ఈ హత్య అనాగరికమని శ్రీలంక క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి, ప్రధానమంత్రి మహింద్రరాజపక్స కుమారుడు నమల్ రాజపక్స ఆందోళన వ్యక్తం చేశారు.
బాధ్యులైన వారిని న్యాయస్థానం ముందుకు తీసుకువస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాగ్థానాన్ని నమల్ రాజపక్స అభినందించారు. ఉగ్రవాదులు స్వేచ్ఛగా ప్రవర్తించడానికి అనుమతిస్తే ఎవరికైనా ఇలాగే జరుగుతుందని గుర్తుంచుకోవాలని కూడా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీలంక హైకమిషనర్ తో సమన్వయం చేసుకుని నేరస్తులను అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక కోరింది. స్థానిక ప్రభుత్వంతో కొలంబో నిరంతరం టచ్ లో ఉంది.
పాకిస్తాన్ నుంచి శ్రీలంక ఆహార ధాన్యాలు, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఔషధాలను దిగుమతి చేసుకుంటోంది. లంక నుంచి టీ, రబ్బరు, దాల్చినచెక్క, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు, సముద్ర ఆహారాన్ని పాకిస్తాన్ కు ఎగుమతి చేస్తోంది.కొన్ని నెలల కిందటే అతిథిగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక సందర్శించారు.
ఇది కూాడా చదవండి : విమానాన్ని చేతులతో నెట్టుకుంటూ తీసుకెళ్లిన ప్రయాణికులు -అసలేం జరిగిందంటే..
ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని అంగీకరించాయి. అనేక మంది శ్రీలంక క్రికెటర్లు కూడా టోర్నమెంట్లు ఆడటానికి పాకిస్థాన్ వెళుతుంటారు. శ్రీలంకలోని శక్తివంతమైన బౌద్ద మతగురువులు కూడా దారుణ హత్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అనాగరిక చర్య దక్షిణాసియా దేశాల మధ్య సంబంధాలపై నీలినీడలు కమ్ముకునే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Imran khan, Pakistan, Sri Lanka