హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Sri Lanka Terror Attack: శ్రీలంక బాంబు పేలుళ్లలో ముగ్గురు భారత పౌరులు మృతి

Sri Lanka Terror Attack: శ్రీలంక బాంబు పేలుళ్లలో ముగ్గురు భారత పౌరులు మృతి

పేలుళ్లు జరిగిన ప్రాంతంలో చిత్రం

పేలుళ్లు జరిగిన ప్రాంతంలో చిత్రం

లోకాషిని, నారాయణ చంద్రశేఖర్, రమేష్ అనే ముగ్గురు చనిపోయినట్టు శ్రీలంక అధికారులు తెలిపినట్టు సుష్మా స్వరాజ్ చెప్పారు.

    శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ముగ్గురు భారత పౌరులు చనిపోయినట్టు విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు. శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో సుమారు 207 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 400 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, చనిపోయిన 207 మందిలో 40మంది విదేశీయులు ఉన్నట్టు సమాచారం. ఈస్టర్ ప్రార్థనల సందర్భంగా చర్చిలను ముష్కరులు టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది చోట్ల పేలుళ్లు జరిగాయి. అందులో సూసైడ్ ఎటాక్స్ కూడా ఉన్నాయి. శ్రీలంక విదేశాంగ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం.. పేలుళ్లలో ముగ్గురు చనిపోయారని సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. వారి వివరాలను కూడా వెల్లడించారు. లోకాషిని, నారాయణ చంద్రశేఖర్, రమేష్ అనే ముగ్గురు చనిపోయినట్టు శ్రీలంక అధికారులు తెలిపినట్టు చెప్పారు. దీంతోపాటు శ్రీలంక పర్యటనకు వెళ్లిన తమ వారి ఆచూకీ కోసం కంగారుపడే భారతీయుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన హెల్ప్ లైన్ నెంబర్లను వెల్లడించారు. శ్రీలంకలోని భారత హైకమిషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లు.


    +94777903082, +94112422788, +94112422789.


    First published:

    Tags: Columbo Bomb Blast, Sri Lanka, Terror attack

    ఉత్తమ కథలు