హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Sri Lanka - Amazon: ఆ బికినీల అమ్మకాలు ఆపండి.. అమెజాన్‌ను కోరిన శ్రీలంక ప్రభుత్వం

Sri Lanka - Amazon: ఆ బికినీల అమ్మకాలు ఆపండి.. అమెజాన్‌ను కోరిన శ్రీలంక ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులపై శ్రీలంక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులపై శ్రీలంక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ జాతీయ జెండా ముద్రించిన బికినీలను అమ్మకాలను సైట్ నుంచి తొలగించాలని శ్రీలంక ప్రభుత్వం అమెజాన్‌ను కోరింది. బికినీలతో పాటు లోదుస్తులు, డోర్ మ్యాట్స్‌ విక్రయించవద్దని విన్నవించింది. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంక జాతీయ జెండా కలిగిన బికినీలు, ఇతర లోదుస్తులు, డోర్ మ్యాట్‌లు.. ఇలా అనేక చైనా ప్రోడక్టులు అమెజాన్‌లో దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక వ్యాప్తంగా అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు.చైనా తయారు చేసిన ఈ ఉత్పత్తులకు వ్యతిరేకంగా రెండు రోజుల నిరసనల తర్వాత శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా తమ జాతీయ జెండాను, బౌద్ద చిహ్నాలను అగౌరవపరచినట్టుగా శ్రీలంక భావించింది.

ఇందుకు సంబంధించి అమెజాన్ సంస్థకు నిరసన తెలియజేసిన శ్రీలంక ప్రభుత్వం.. ఇలాంటి ఉత్పత్తుల తయారీకి, అమ్మకాలకు ముగింపు పలకాలని చైనా అధికారులను కోరింది. శ్రీలంక జాతీయ జెండాను దుర్వినియోగం చేసేలా ఉన్న అన్ని రకాల ఉత్పత్తులను విక్రయించడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరినట్టు చైనాలోని శ్రీలంక ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వాషింగ్టన్‌లోని శ్రీలంక ఎంబసీ అధికారులు ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇది శ్రీలంక మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించడమే అని ఫిర్యాదు చేసింది.


ఇక, అమెజాన్‌లో పలువురు చైనీస్ విక్రేతలు నాన్-స్లిప్ డోర్‌మాట్‌లను $ 10 నుంచి $ 24 ధరతో, సింహం ఫొటో ముద్రించిన బ్రీఫ్‌లు మరియు బికినీలను $9.20 నుంచి $17.30 ధరలతో విక్రయిస్తున్నారు. వీటి అమ్మకాలపై పలువురు శ్రీలంక వాసులు సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేశారు.శ్రీలంకను చైనా ఎలా చూస్తుందో దీని ద్వారా తెలుస్తోందని ఓ ఫేస్‌బుక్ యూజర్ పేర్కొన్నారు.

First published:

Tags: Amazon, Bikini, Sri Lanka

ఉత్తమ కథలు