హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఓ సూసైడ్ బాంబర్ జనాల్ని చంపితే, మరో బ్లాస్ట్‌లో అతడి భార్య, సోదరి మృతి

ఓ సూసైడ్ బాంబర్ జనాల్ని చంపితే, మరో బ్లాస్ట్‌లో అతడి భార్య, సోదరి మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శ్రీలంకలో ఇప్పటి వరకు 290 మందికి పైగా చనిపోయారు. అందులో 9 మంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

    ఓ ఉన్మాది సూసైడ్ బాంబర్‌గా మారి కొందరి ప్రాణాలు తీస్తే, మరో బాంబు పేలుడులో అతని భార్య, సోదరి చనిపోయారు. శ్రీలంకలో ఈనెల 21న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఓ టెర్రరిస్ట్ భార్య, సోదరి కూడా చనిపోయినట్టు ఆ దేశ అధికారులు ధ్రువీకరించారు. కొలంబో చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఈ మేరకు అధికారికంగా తెలిపారు. ఈనెల 21న కొలంబోలోని షాంగ్రి లా హోటల్లో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకుని చనిపోయాడు. అతడిని ఓ ఫ్యాక్టరీ యజమానిగా పోలీసులు గుర్తించారు. అవిసావెల్లా - వెల్లంపిటియా రోడ్‌లో ఉండే ఓ ఫ్యాక్టరీ యజమాని ఇన్సాన్ సెల్వన్‌గా పోలీసులు నిర్ధారించారు. వరుస బాంబు పేలుళ్లపై విచారణ జరిపిన పోలీసులు అతడి ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో షాంగ్రి లా హోటల్లో సూసైడ్ ఎటాక్ చేసిన వ్యక్తి భార్య, సోదరి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు.


    శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వకు 290 మందికి పైగా చనిపోయారు. అందులో 35 మంది విదేశీయులు ఉన్నారు. 9 మంది భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస బాంబు పేలుళ్ల కేసులో సెల్వన్ కంపెనీలో పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 24 మంది అనుమానితులను పట్టుకున్నారు. వరుస బాంబు పేలుళ్ల తర్వాత శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. శ్రీలంక వరుస పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉందని భావిస్తున్నారు.

    First published:

    Tags: Columbo Bomb Blast, Sri Lanka Blasts, Terror attack

    ఉత్తమ కథలు