Home /News /international /

SRI LANKA PRESIDENT GOTABAYA RAJAPAKSA AND HIS WIFE FLEE TO MALDIVES AMID TIGHT SECURITY SK

Sri Lanka: పక్కదేశానికి పారిపోరిపోయిన శ్రీలంక అధ్యక్షుడు.. కొత్త సర్కార్ వారిదేనా?

గొటబాయ రాజపక్స

గొటబాయ రాజపక్స

SriLanka Crisis: శ్రీలంక త్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్జేబీ నేత సాజిత్ ప్రేమదాస ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    ఇటు ఆర్థిక సంక్షోభం.. అటు రాజకీయ సంక్షోభంతో.. శ్రీలంక (Srilanka Crisis) అల్లాడిపోతోంది. ప్రజల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ప్రభుత్వ బాధ్యతలను తీసుకొని... దేశ పరిస్థితులను చక్కదిద్దే నాయకుడే కనిపించడం లేదు. ఎంత మంది వచ్చినా.. లంక మాత్రం సంక్షోభ ఊబి నుంచి గట్టెక్కలేకపోతోంది. గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిణామాల క్రమంలో.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa) దేశం విడిచిపోయారు. ప్రజల ఆగ్రహ జ్వాలల నేపథ్యంలో ఆయన కుటుంబం యుద్ధ విమానంలో దేశం నుంచి వెళ్లిపోయారు. గొటబాయ రాజపక్సతో పాటు ఆయన భార్యను శ్రీలంక వాయుసేన క్షేమంగా మాలికి చేర్చింది. ఆంటోనోవ్-23 యుద్ధ విమానంలో మాలికి వెళ్లిపోయారు. ఆయన విమానం ల్యాండింగ్‌కు మొదట మాలె ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. ఐతే మాల్దీవులు (Maldives) పార్లమెంట్ స్పీకర్ మజ్లిస్, ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ చొరవతో ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. మాలెలో కొద్ది రోజులు గడిపి.. ఆ తర్వాత యూఏఈలో గొటబాయ ఆశ్రయం పొందుతారని తెలుస్తోంది.




    మూడు రోజుల క్రితం ఆందోళనకారులు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. వేలాది మంది నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్తున్నారని తెలిసి..  అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన ఇల్లు విడిచి పారిపోయారు. యుద్ధ నౌకలో సముద్రంలోకి వెళ్లిపోయారు. లంకలో ఆర్థిక సంక్షోభానికి గొటబాయే కారణమని.. రాజీనామా చేయాలని ప్రజలతో పాటు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. జులై 13న రాజీనామా చేస్తానని గొటబాయ రాజపక్స ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. దేశం విడిచిపెట్టి వెళ్లిపోయేందుకు అనుమతి ఇస్తేనే రాజీనామా చేస్తానని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ షరతుకు అంగీకరించిన ఆర్మీ.. ప్రత్యేక యుద్ధ విమానంలో గొటబాయ, ఆయన భార్యతో పాటు ఇద్దరు బాడీగార్డ్స్‌ని మాలెకు పంపించింది. ఐతే మాలెకు వెళ్లిన తర్వాత గొటబాయ మాటమార్చారు. ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. ఇప్పటి వరకు రాజీనామా లేఖ అందలేదని.. ఈ రోజు అందుతుందని భావిస్తున్నట్లు లంక పార్లమెంట్ స్పీకర్ మీడియాకు తెలిపారు.





    లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశముంది. మరి ఆయన రాజీనామా చేస్తే.. కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఉత్కంఠ రేగుతోంది. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలైన SJB, SLFP నేతలు చర్చలను ముమ్మరం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్జేబీ నేత సాజిత్ ప్రేమదాస ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి రాజీనామాలు చేసిన పరిస్థితుల్లో.. ఆపద్ధర్మ అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత 30 రోజుల్లో.. పార్లమెంట్ సభ్యులు తమలో ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికోవాల్సి ఉంటుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Gotabaya Rajapaksa, International news, Sri Lanka, Srilanka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు