Home /News /international /

లారీలు, కార్లలో బాంబుల తరలింపు...లంకలో మరిన్ని పేలుళ్లకు కుట్ర

లారీలు, కార్లలో బాంబుల తరలింపు...లంకలో మరిన్ని పేలుళ్లకు కుట్ర

చర్చి వద్ద భద్రతా దళాల సెక్యూరిటీ

చర్చి వద్ద భద్రతా దళాల సెక్యూరిటీ

ఆదివారం జరిగిన పేలుళ్లకు కూడా ట్రక్కుల్లోనే బాంబులను తరలించారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో కొలంబో చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని ట్రక్కులు, కార్లను తనిఖీ చేస్తున్నారు.

  ఉగ్ర ముష్కరుల మారణహోమంతో శ్రీలంక ఇప్పటికే కన్నీళ్లు పెడుతోంది. నరరూప రాక్షషుల నరమేధాన్ని తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడి అక్కడి ప్రజలను ఇంకా భయపడుతోంది. శాంతికాముక లంకలో నెత్తుటేరుల పారించిన ఉగ్రవాదులు.. కొలంబోలో మరిన్ని పేలుళ్లకు కుట్రచేసినట్లు తెలుస్తోంది. లారీతో పాటు మరో కారులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను తరించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో లంక పోలీసులు అప్రమత్తమయ్యారు.

  కొలంబోలోని అన్ని పోలీస్ స్టేషన్‌లను ప్రభుత్వం హైఅలర్ట్ చేసింది. కొలంబో వైపుగా ట్రక్కు, కారు వెళ్లాయని సమాచారం అందించడంతో పోలీస్ బృందాలు వాటి కోసం గాలిస్తున్నాయి. కొలంబో చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లెనీ జల్లెడ పడుతున్నాయి. హైవేలపై పికెటింగ్ ఏర్పాటుచేసిన ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అటు సముద్ర మార్గంలోనూ పటిష్ట నిఘాపెట్టారు. ఆదివారం జరిగిన పేలుళ్లకు కూడా ట్రక్కుల్లోనే బాంబులను తరలించారు ఉగ్రవాదులు. ఈ నేపథ్యంలో కొలంబో చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని ట్రక్కులు, కార్లను తనిఖీ చేస్తున్నారు.

  ఈస్టర్ రోజు కొలంబోతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది చనిపోయారు. వందలాది మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల వెనుక ఐఎస్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఇప్పటి వరకు ఆధారాలు లభించగా, వరుస పేలుళ్లకు పాల్పడింది తామేనని ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు అమాఖ్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఈ ప్రకటన చేసింది. పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 24 మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది నేషనల్ థోవీద్ జమాత్ (NTJ)కి చెందిన వాళ్లే ఉన్నట్లు సమాచారం.

  First published:

  Tags: Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు