50 ఏళ్ల రాజకీయ చరిత్ర.. ‘న్యూస్18’తో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స ఇంటర్వ్యూ..

50 ఏళ్ల రాజకీయ చరిత్ర.. ‘న్యూస్18’తో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స ఇంటర్వ్యూ..

శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్స

మహీంద రాజపక్స.. నిన్నటి(మే 27)తో 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆయన CNN-News18 సౌత్ హెడ్ డీపీ సతీష్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

 • Share this:
  మహీంద రాజపక్స.. శ్రీలంకకు ప్రధాని, మాజీ అధ్యక్షుడు. మూడు సార్లు ప్రధాన మంత్రిగా, రెండు సార్లు అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. నిన్నటితో (మే 27)తో 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న ఆయన CNN-News18 సౌత్ హెడ్ డీపీ సతీష్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పొరుగు దేశాలైన భారత్, చైనాతో సంబంధాలపై, తమిళుల అభివృద్ధిపై మాట్లాడారు. భారత్, చైనాతో శ్రీలంక స్నేహ సంబంధాలనే కోరుకుంటోందని అన్నారు. తమిళులు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ప్రత్యేక దేశాన్ని కాదని అన్నారు. తమిళుల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అది.. తమిళుల నుంచైనా, ఇస్లాం ఉగ్రవాదమైనా సహించమని అన్నారు. ఎల్‌టీటీఈపై తీవ్రంగా పోరాటం చేశామని, అదే తన జీవితంలో అతిపెద్ద ఛాలెంజ్ అని అన్నారు.
  యువ నాయకుడిగా మహీంద రాజపక్స


  తాను తొలిసారి అధ్యక్షుడిగా పదవి చేపట్టేనాటికి ఎల్‌టీటీఈ తీవ్ర స్థాయిలో ఉందని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్, పోలీసుల సహాయంతో తాము దాన్ని మట్టుబెట్టామని రాజపక్స తెలిపారు. తనను తాను ఫాదర్ ఆఫ్ ద నేషన్‌గా అభివర్ణించుకున్న రాజపక్స.. తదుపరి తరం రాజకీయ నాయకులను తయారు చేయాల్సిన బాధ్యత తనపైనే ఉందని అన్నారు. ‘సార్క్’ ఆవశ్యతకను ఆయన నొక్కి చెప్పారు.
  చిన్నప్పుడు మహీంద రాజపక్స.. (ఎడమ నుంచి మూడో వ్యక్తి)


  ముఖ్యంగా భారత్, శ్రీలంక సంబంధాలపై మాట్లాడుతూ.. ‘ద్వైపాక్షిక సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. 1948 నుంచి 1980 వరకు ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే, ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ మంచి సంబంధాల దిశగా సాగుతున్నాం. ఇరు దేశాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా మంచి సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది’ అని రాజపక్స అన్నారు.

  తమిళుల సమస్యలపై స్పందిస్తూ.. తమిళ రాజకీయనాయకులు లేవనెత్తే అంశాలు ఆ వర్గ ప్రజల సమస్యలకు చాలా దూరంగా ఉన్నాయని, తమిళ ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. అందుకే రాజకీయ నాయకులు ఇప్పటికైనా మారి, తమ డిమాండ్లను ఉపసంహరించుకోవాలని సూచించారు.

  తన తల్లి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన రాజపక్స.. 1970లో తొలిసారి ఎంపీగా శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 24 ఏళ్లు. ఆ దేశ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీ ఆయనే. ఇప్పటికీ ఆ రికార్డు అలాగే ఉంది. 1977 నుంచి 1993 వరకు ప్రతిపక్షంలో ఉన్నారు. 2005లో అధ్యక్షుడిగా అధికారం చేపట్టి 30 ఏళ్లుగా సమస్యగా ఉన్న ఎల్‌టీ‌టీఈని నామరూపాల్లేకుండా చేశారు. తన తమ్ముడు గొటబాయ అధ్యక్షుడిగా ఉండగా, రాజపక్స ప్రధానిగా ఉన్నారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: