Home /News /international /

SRI LANKA IN TALKS FOR 100 MN DOLLERS EMERGENCY FUNDING FROM CHINA BACKED BANK PVN

China Loans To Sri Lanka : బుద్ధి తెచ్చుకోని లంక..మరిన్ని రుణాలతో శ్రీలంకను మళ్లీ ట్రాప్ చేస్తోన్న చైనా

అత్యవసర ఫండ్ కోసం చైనా బ్యాంక్ తో శ్రీలంక చర్చలు

అత్యవసర ఫండ్ కోసం చైనా బ్యాంక్ తో శ్రీలంక చర్చలు

Sri Lanka Crisis : ప్రస్తుతం సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు సాయమందించేందుకు భారత్ సహా మరికొన్ని దేశాలు ముందుకొస్తుంటే..శ్రీలంకను నట్టేట ముంచిన చైనా మాత్రం ఆ దేశానితో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా చూస్తూ ఉండిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మరిన్ని రుణాలు అందించి శ్రీలంకను ఇరుకున పెట్టాలని చైనా చూస్తోంది.

ఇంకా చదవండి ...
Sri Lanka Looking For China Loans : మన పొరుగుదేశమైన శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి..దాని నుంచి బయటపడేందుకు నానా అగచాట్లు పడుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా అక్కడ ఆహారం, ఇంధన, ఔషధాల కొరత ఉంది. దీంతో నిత్యావసరాల వస్తువులు ఆకాశాన్నంటాయి. స్వతంత్రం వచ్చిన ఇన్నాళ్లకు శ్రీలంక దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రభుత్వం చేసిన అప్పులు, కోవిడ్, లాక్‌డౌన్ వంటి పరిణామాలతో శ్రీలంక ఆదాయానికి గండి పడింది. దాంతో విదేశీ కరెన్సీ నిల్వలు తరిగి.. తీవ్రమైసన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఫలితంగా 22 మిలియన్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతో సామాన్య ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్థం కావడానికి అధ్యక్షుడి విధాన తప్పిదాలే కారణమని మండిపడ్డారు. దీంతో శ్రీలంక రాజధాని కొలంబోలో ఎప్పటి నుంచో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తక్షణం దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి చైనానే కారణమని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. శ్రీలంక ప్రభుత్వం తన సరళీకరణ విధానంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 1980ల నుండి తన విదేశీ పెట్టుబడి విధానాలను అవలంబిస్తోంది. ఈ విధానాలతో చైనా చాలా లాభపడింది. శ్రీలంక అవసరాలను చైనా తనకు అనువుగా పరిగణించింది. కరోనాకు ముందు చైనా.. శ్రీలంకలో భారీగా పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకకు రుణాలు అందించింది. అయితే కరోనా తర్వాత అది భారంగా మారింది. మెరుగైన మౌలిక సదుపాయాలు, ఉన్నత ఉపాధి, ఆదాయం, ఆర్థిక స్థిరత్వం, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఉద్దేశంతో శ్రీలంక... చైనా విదేశీ పెట్టుబడులకు లొంగిపోయింది. ఈ విధంగా శ్రీలంక.. చైనాపై ఆధారపడింది. 2022లో శ్రీలంకపై దాదాపు 7 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఉంది. 2021-22లోనే శ్రీలంంకు చైనాకు చెల్లించాల్సిన రుణా విలువే 2 బిలియన్ యూఎస్ డాలర్ల వరకు ఉంది.

ALSO READ Snake Island : రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆ ప్రాంతంలో భీకర పోరు..మరో రష్యా యుద్ధనౌకను ముంచిన ఉక్రెయిన్

అయితే ప్రస్తుతం సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు సాయమందించేందుకు భారత్ సహా మరికొన్ని దేశాలు ముందుకొస్తుంటే..శ్రీలంకను నట్టేట ముంచిన చైనా మాత్రం ఆ దేశానితో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా చూస్తూ ఉండిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మరిన్ని రుణాలు అందించి శ్రీలంకను ఇరుకున పెట్టాలని చైనా చూస్తోంది. మరోవైపు,శ్రీలంక నేతలు కూడా ఈజీగా చైనా ట్రాప్ లో పడిపోతున్నారు. జాగా అత్య‌వ‌స‌ర మ‌ద్దతు కోసం 100 మిలియ‌న్ డాల‌ర్ల సాయం కోరింది. ఈ విషయాన్ని శనివారం శ్రీ‌లంక ఆర్థిక‌శాఖ వెల్ల‌డించింది. శ్రీ‌లంక‌కు చైనా మ‌ద్ద‌తుతో ప‌ని చేస్తున్న ఏషియాన్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సాయం చేయ‌నున్న‌ది. దేశీయ ప్ర‌భుత్వ రంగ బ్యాంకులకు విదేశీ మార‌క ద్ర‌వ్య నిధుల ల‌భ్య‌త కోసం సాయం చేయాల‌ని శ్రీ‌లంక కోరింద‌ని ఏషియాన్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ తెలిపింది. ఆసియా వ్యాప్తంగా మౌలిక వ‌స‌తుల‌ను పురోభివృద్ధి చేయ‌డానికి ఏఐఐబీ 2014లో ఏర్పాటైంది.

ALSO READ OMG : ఊడిపోయిన పురుషాంగం..ఆరేళ్లుగా చేతితో పట్టుకొని తిరిగాడు..చివరికి

ఇక శ్రీలంక తన నిల్వలను పెంచుకోవడానికి 1.3 బిలియన్ల డాలర్ల సిండికేట్ రుణాన్ని మరియు 1.5 బిలియన్ డాలర్ల యువాన్-డినామినేటెడ్ రుణాన్ని పొడిగించింది చైనా. శ్రీలంక...1.5 బిలియన్ల క్రెడిట్ లైన్ మరియు $1 బిలియన్ల వరకు తాజా సిండికేట్ రుణం కోసం చైనాతో చర్చలు జరుపుతోంది. ఏప్రిల్‌లో శ్రీలంక కొన్ని బాహ్య రుణాల చెల్లింపులను నిలిపివేసిన తర్వాత చైనా రుణాన్ని రీఫైనాన్స్ చేయడంపై చర్చలు ప్రారంభమయ్యాయని కొలంబో ఇటీవల తెలిపింది. మరోవైపు,లంకలో అధ్యక్షుడు,ప్రధాని రాజీనామాలు చేయాలంటూ ప్రజలు చేస్తోన్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయని పేర్కొంటూ శ్రీలంక అధ్యక్షుడు రెండు రోజుల క్రితం దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Srilanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు