Sri Lanka hikes fuel prices : చరిత్రలో కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది శ్రీలంక(Sri Lanka). ప్రజల ఇబ్బందులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పెట్రోల్,డీజిల్ ధరలను(Oil Prices)భారీగా పెంచింది అక్కడి ప్రభుత్వం. పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్‌పై 38.4 శాతం పెంచుతూ మంగళవారం శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీ ప్రకటించింది. విదేశీ మారక నిల్వల కొరత కారణంగా దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మధ్య ఇంధన ధరలను రికార్డు స్థాయిలో పెంచడంతో గతంలో ఎప్పుడు లేనివిధంగా దేశంలో చమురు ధరలు పెరిగాయి.
ఆర్థిక సంక్షోభ పరిస్థితుల మధ్య ఏప్రిల్ 19 నుండి రెండవసారి శ్రీలంక ఇంధన ధరలను పెంచింది. దీంతో ఎన్నడూ లేని విధంగా లీటరు పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.420 కి చేరగా, డీజిల్ ధర ఏకంగా లీటరకు రూ.400కు పెరిగింది. పెరిగిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని శ్రీలంక పేర్కొంది. విద్యుత్తు, ఇంధన శాఖ మంత్రి కంచన విజెశేకెర ఓ ట్వీట్ చేస్తూ పెట్రోలు ధరలు 20 నుంచి 24 శాతం, డీజిల్ ధరలు 35 నుంచి 38 శాతం పెరుగుతాయని, తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇంధన కొనుగోలుపై ఉన్న రోజువారీ పరిమితి కొనసాగనుందని తెలిపారు.తాజా పెరుగుదలకు సమాంతరంగా రవాణా రంగంలో వ్యయ పెంపునకు వీలుగా ప్రభుత్వం రవాణా రంగ భాగస్వాములతో చర్చిస్తుందని మంత్రి కంచన చెప్పారు.
ALSO READ Shocking : ఒక స్కూటర్ పై ఆరుగురు ప్రయాణం..వీడియో వైరల్
పెట్రోల్, డీజిల్(Petrol Diesel) కొరత భారీగా నెలకొన్న ఈ సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున బంకుల వద్ద క్యూ కడుతున్నారు. భారతదేశానికి చెందిన ఆయిల్ మేజర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు శ్రీలంక అనుబంధ సంస్థ అయిన లంక IOC కూడా ఇంధన ధరలను పెంచింది. సీపీసీకి అనుగుణంగా తాము కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు శ్రీలంక ఐఓసీ(Lanka IOC)తెలిపింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. తాము కూడా కిలోమీటరకు రూ.90 చొప్పున ఖార్జీలను పెంచుతున్నట్టు ఆటో రిక్షా ఆపరేటర్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఖర్చులను తగ్గించే చర్యగా, ఉద్యోగులు భౌతికంగా రిపోర్టు చేయడానికి అవసరమైన విచక్షణాధికారాన్ని సంస్థల అధిపతులకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన వారు ఇంటి నుండి పని చేయడానికి అనుమతించారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు అన్ని నిత్యావసరాల కొరత కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Oil prices, Srilanka