Home /News /international /

SRI LANKA HAS ASKED INDIA TO LEND 500 MILLION DOLLARS TO HELP FOR PURCHASE FUEL IN THEIR CRISIS PRV

Sri Lanka: కష్టాల్లో ఉన్నాం ఆదుకోండంటూ భారత్​ను అర్థించిన శ్రీలంక.. అప్పుగా 50 కోట్ల డాలర్లు ఇవ్వాలంటూ వేడుకోలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పొరుగు దేశం శ్రీలంక (srilanka)ను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తూనే ఉంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. ఇపుడు ఏకంగా ఆదుకోవాలని భారత్​ను శ్రీలంక అర్థిస్తోంది.

    ఏడాది కాలంగా పొరుగు దేశం శ్రీలంక (srilanka)ను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తూనే ఉంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం (Foreign exchange currency) భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. పర్యాటక రంగం (Tourism)పై తీవ్ర ప్రభావం చూపింది. విదేశీయుల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. దీంతో భారీగా ఆదాయం పడిపోయింది. విదేశీ మారక నిల్వ (Foreign exchange storage)లను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం (ban) విధించింది ప్రభుత్వం. అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమ పిండి, కూరగాయాలు (vegetables) వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతుల (Imports)పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో దిగుమతులపై శ్రీలంక ప్రభుత్వ నిషేధం (ban) విధించడంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర ప్రభావం పడింది. ఇపుడు ఏకంగా ఆదుకోవాలని భారత్​ను శ్రీలంక అర్థిస్తోంది. ఏకంగా 50 కోట్ల డాలర్లు (500 million dollars) అప్పుగా ఇవ్వాలంటూ భారత్​ (india)ను వేడుకుంటోంది.

    విదేశీ మారక నిల్వలు లేవు..

    శ్రీలంకలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఇప్పుడు ఈ దేశానికి ఇంధనం కొనుగోలు  (crude oil purchases )చేయడానికి కూడా నిధులు లేవు. దీంతో తమకు సాయం చేయమంటూ భారత్‌ని కోరుతుంది. చమురు కొనుగోళ్లకు (crude oil purchases) చెల్లించేయడానికి కూడా నిధులు లేవు.. 500 మిలియన్ల డాల‌ర్ల (500 millions USD)ను అప్పుగా ఇవ్వమని శ్రీలంక అభ్యర్థిస్తోంది. ప్రస్తుతం తమ దేశంలో ఉన్న చ‌మురు నిల్వలు వ‌చ్చే జ‌న‌వ‌రి వ‌ర‌కు మాత్రమే స‌రిపోతాయని ఆ దేశ ఇంధ‌న శాఖ మంత్రి ఉద‌య గ‌మ్మన్‌ పిలా హెచ్చరించిన కొన్ని రోజులకే శ్రీలంక నుంచి భారత్​ (India)కు ఈ ప్రతిపాదన వచ్చింది.

    330 కోట్ల డాల‌ర్లు చెల్లించాలి..

    శ్రీలంక ప్రభుత్వ రంగ సంస్థ సీలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్ (Ceylon Petroleum Corporation).. ప్రధాన ప్రభుత్వ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ సీలోన్‌, పీపుల్స్ బ్యాంక్‌ వంటి అనేక బ్యాంకులకు భారీగా బాకీ పడింది. ఈ బాంకులకు సీలోన్ పెట్రోలియం కార్పొరేష‌న్ సుమారు 330 కోట్ల డాల‌ర్లు చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ మిడిల్‌ఈస్ట్‌, సింగపూర్‌ నుంచి వివిధ రకాల పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకొంటోంది. దీంతో ఆ అప్పులను తీర్చడానికి ‘భారత్‌’ సాయం అర్దిస్తుంది.

    శ్రీలకంలో బాండ్ల విక్రయంలోనూ సెంట్రల్ బ్యాంకు విఫలమవుతోంది. జూలై 2021 చివరి నాటికి శ్రీలంక విదేశీ మారక ద్రవ్య నిల్వలు 2.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. నవంబర్ 2019న 7.5 బిలియన్ డాలర్లు ఉండగా.. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా భారీ వాణిజ్య లోటు కొన్ని సంవత్సరాలుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తోంది. విదేశీ మారక ద్రవ్యాల నిల్వను కాపాడుకునేందుకు విదేశాల్లో తయారైన టూత్​ బ్రష్ హ్యాండుళ్లు, సుగంధ ద్రవ్యాలు, వెనెటియన్ బ్లెండ్స్​, స్ట్రాబెర్రీలు, వెనిగర్​, వెట్ వైప్స్​, పంచధార లాంటి అనేక వస్తువులను దిగుమతి చేసుకోవడం గతేడాదే శ్రీలంక ప్రభుత్వం నిషేధించింది. దిగుమతుల నియంత్రణ దారుణంగా పడిపోవడం 1970ల తర్వాత ఇప్పుడు మరోసారి జరిగింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Fuel prices, India, Money, Sri Lanka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు