Home /News /international /

SRI LANKA GOVERNMENT SAYS LOCAL ISLAMIST GROUP BEHIND BLASTS THAT KILLED 290

Sri Lanka Blasts:పేలుళ్లపై పలు కోణాల్లో దర్యాప్తు...ముస్లీం వేర్పాటువాద సంస్థ ప్రమేయంపై అనుమానం

కొలంబోలో పేలుళ్లు జరిగిన ప్రాంతంలో చిత్రం

కొలంబోలో పేలుళ్లు జరిగిన ప్రాంతంలో చిత్రం

Sri Lanka Blasts: ఈస్టర్ రోజైన ఆదివారం బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. చర్చిలు, స్టార్ హోటళ్లలో విదేశీ పర్యాటకులు, క్రైస్తవులు లక్ష్యంగా 8 చోట్ల జరిగిన వేర్వేరు బాంబు పేలుళ్లు, ఆత్మహుతి దాడుల్లో 290 మంది దుర్మరణం చెందగా...500 మందికి పైగా గాయపడ్డారు.

ఇంకా చదవండి ...
    శ్రీలంకలో 290 మందిని బలికొన్న మారణహోమం ఘటనలో స్థానిక ముస్లిం వేర్పాటువాద సంస్థ ప్రమేయంపై ఆ దేశ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తంచేస్తోంది. నేషనల్ తౌవీత్ జమాత్(ఎన్టీజే) అనే అతివాద ముస్లీం వేర్పాటువాద సంస్థ హస్తం ఈ మారణహోమం వెనుక ఉండొచ్చని శ్రీలంక మంత్రి, ప్రభుత్వ అధికార ప్రతినిధి రజితా సేనరత్నే సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈ సంస్థకు అంతర్జాతీయ సాయం అందిందా? అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

    నేషనల్ తౌవీత్ జమాత్‌ సంస్థ గురించి శ్రీలంకలో కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. గతంలో బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ఆ సంస్థ వార్తల్లో నిలిచేది. శ్రీలంకలో ఆదివారంనాటి మారణహోమం ఘటన తర్వాత ఎన్టీజే సంస్థకు చెందిన 24 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేలుళ్లలో ఎన్టీజీ ప్రమేయంపై విచారణ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తునకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.

    అటు ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో దేశంలో సోమవారం అర్థరాత్రి నుంచి అత్యవసర పరిస్థితిని అమలు చేయనున్నట్లు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. త్రివిధ దళాలు, పోలీసులు కలిసి పనిచేసే నిమిత్తం అత్యవసర పరిస్థితిని అమలులోకి తీసుకొస్తున్నట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. అటు ఈ ఘటనపై విచారణ జరిపేందుకు శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన త్రిసభ్య కమిటీని నియమించారు.

    Srilanka Blasts Live Updates : Death toll from attacks on Sri Lankan churches and hotels rises to 290
    శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగిన ఓ ప్రాంతంలో చిత్రం


    దేశంలోని చర్చిలు, భారత హైకమిషన్‌పై దాడులకు ఎన్టీజే కుట్రపన్నినట్లు విదేశీ ఇంటెలిజన్స్ సంస్థల నుంచి శ్రీలంక పోలీస్ చీఫ్‌కు ముందస్తు సమాచారమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీలంక పోలీస్ చీఫ్ ఈ నెల 11న భద్రతా బలగాలను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

    Terrorism Was a Distant Memory for Us': Sri Lankans Fear Return of Violence After Bloody Easter Sunday
    పేలుళ్లు జరిగిన ఓ ప్రాంతంలోని చిత్రం


    ఈస్టర్ రోజైన ఆదివారం బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. చర్చిలు, స్టార్ హోటళ్లలో విదేశీ పర్యాటకులు, క్రైస్తవులు లక్ష్యంగా 8 చోట్ల జరిగిన వేర్వేరు బాంబు పేలుళ్లు, ఆత్మహుతి దాడుల్లో 290 మంది దుర్మరణం చెందగా...500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు భారతీయులు సహా దాదాపు 40 మంది విదేశీయులు కూడా ఉన్నారు.
    First published:

    Tags: Sri Lanka, Sri Lanka Blasts

    తదుపరి వార్తలు