Home /News /international /

SRI LANKA ECONOMIC CRISIS UPDATES SRI LANKA CABINET RESIGNS EXCEPT PRESIDENT AND PM MAHINDA RAJAPAKSA MKS

Sri Lanka crisis: కేంద్ర కేబినెట్ రాజీనామా.. ప్రధాని అనూహ్య నిర్ణయం.. ధరలపై ఆగని జనపోరాటం

శ్రీలంక కేబినెట్ రాజీనామా

శ్రీలంక కేబినెట్ రాజీనామా

రెండు వారాలుగా కొనసాగుతోన్న నిరసనల దెబ్బకు కేంద్ర కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. నిజానికి ప్రజలంతా ప్రధానమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తుండగా..

సంక్షోభ శ్రీలంకలో గంటగంటకూ పరిణామాలు మారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా వ్యవస్థలు కూలిపోయి, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగ్గా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు దాదాపు తిరుగుబాటు చేశారు. రెండు వారాలుగా కొనసాగుతోన్న నిరసనల దెబ్బకు కేంద్ర కేబినెట్ మొత్తం రాజీనామా చేయాల్సి వచ్చింది. నిజానికి ప్రజలంతా ప్రధానమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తుండగా, మహీంద రాజపక్స్ తెలివిగా కేబినెట్ మంత్రులతో రాజీనామాలు చేయించి, తాను మాత్రం పదవిలోనే కొనసాగుతున్నారు. పూర్తి వివరాలివే..

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, ప్రజల నిరసనలు, ప్రభుత్వ బలగాల అణిచివేతలతో అల్లకల్లోలంగా మారిన శ్రీలకలో ఆదివారం రాత్రి అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశాన్ని నడిపించడంలో దారుణంగా ఫెయిలైన ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా చేయాలంటూ జనం నిరసనలు చేస్తున్నక్రమంలో ఆయన గద్దెదిగడానికి నిర్ణయించుకున్నారని, అధ్యక్షుడు గొటబయా రాజపక్సకు ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా లేఖను కూడా పంపారని వార్తలు వచ్చాయి. కానీ గంటల వ్యవధిలోనే ప్రధాని కార్యాలయం ఆ వార్తలను ఖండించింది. తిరిగి కాసేపటికే కేంద్ర కేబినెట్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది..

Sri Lanka Crisis: ప్రధానమంత్రి రాజీనామా!.. ధరలపై ప్రజాయుద్ధం దెబ్బకు రాజపక్స నిర్ణయం!


ప్రధాని రాజపక్స్ సారధ్యంలోని కేంద్ర కేబినెట్ లో 26 మంది మంత్రులు ఉండగా, ఆదివారం రాత్రి వారంతా రాజీనామాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే దిశగా కొలంబో వేదికగా జరిగిన కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు మంత్రులు తమ రాజీనామా లేఖలను ప్రధాని రాజపక్సకు అందజేశారు. పదవుల నుంచి తప్పుకున్న మంత్రుల్లో రాజపక్స కొడుకు కూడా ఉన్నారు. అయితే, నిరసనకారులు మాత్రం ప్రధాని తప్పుకునేదాకా ఆందోళనలను ఆపబోమని స్పష్టం చేశారు.

Lockdown పెట్టినా ఆగని కరోనా వ్యాప్తి -కొత్త వేరియంట్ దెబ్బకు చైనా విలవిల -2ఏళ్ల తర్వాత భారీగా కొత్త కేసులు


అధిక ధరలకు వ్యతిరేకంగా శ్రీలంకలో జనం రోడ్లపైకి రావడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఆ వెంటనే లాక్ డౌన్ కూడా ప్రకటించింది. కానీ ఆంక్షలను లెక్క చేయకుండా జనం ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. దీంతో వందల సంఖ్యలో నిరసనకారులను ప్రభుత్వం అరెస్టు చేసింది. విద్యుత్‌ కోతలపై నిరసన తెలియజేయడానికి అధ్యక్షుడు రాజపక్స ఇంటి బయట ఉన్న కరెంటు స్తంభం ఎక్కిన ఓ వ్యక్తి... ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మరణించాడు.

CM KCR | PM Modi: ఇక ఢిల్లీ దద్దరిల్లేలా -వారం పాటు సీఎం కేసీఆర్ అక్కడే -ప్రధాని మోదీ టైమిస్తారా?


శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాలకు తీవ్రంగా కొరత ఏర్పడటం, ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు అల్లాడుతున్నారు. కేజీ బియ్యం ధర మన కరెన్సీలో రూ.220కాగా, గోధుమల ధర రూ.190కి చేరింది. చక్కెర కేజీ రూ.240, కొబ్బరి నూనె లీటరు ధర రూ.850, ఒక కోడిగుడ్డు రూ.30, కేజీ మిల్క్ పౌడర్ ధర రూ.1,900గా ఉంది.

Radisson Blu: డ్రగ్స్ ఎలా ఉంటాయో తెలీదు.. పోలీసుల తీరు కరెక్టేనా?: రాహుల్ సిప్లీగంజ్ సంచలనం


కల్లోల శ్రీలంకకు భారత్ భారీ సహాయాన్ని అందిస్తున్నది. 2.5 బిలియన్ డాలర్ల సాయంతో పాటు లక్షల టన్నుల ఇంధనాన్ని, వేల క్వింటాల బియ్యాన్ని పంపింది. మరోవైపు... కొలంబోకు విమానాల రాకపోకలను తగ్గించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీ, చెన్నై నుంచి కొలంబోకు వారంలో 16 సర్వీసులు తిరుగుతున్నాయి. డిమాండ్‌ లేనందున ఏప్రిల్‌ 9 నుంచి వారానికి 13 సర్వీసులను మాత్రమే తిప్పనున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.
Published by:Madhu Kota
First published:

Tags: Price Hike, Prime minister, Sri Lanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు