Home /News /international /

SRI LANKA ECONOMIC CRISIS STATE OF EMERGENCY DECLARED AFTER PROTESTS TURN VIOLENT PVN

Sri Lanka : హింసాత్మకంగా ఆందోళనలు..శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sri Lanka Emergency : ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేనే కారణమంటూ..గురువారం రాత్రి కొలంబోలోని ఆ దేశ అధ్యక్షుడి ఇంటి బయట ఆందోళనకారులు చేప‌ట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.

ఇంకా చదవండి ...
State of Emergency Declared In Sri Lanka : లంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ప్రభుత్వం పైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సాధారణ ప్రజలు సైతం వీధుల్లోకి వస్తున్నారు. ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేనే కారణమంటూ..గురువారం రాత్రి కొలంబోలోని ఆ దేశ అధ్యక్షుడి ఇంటి బయట ఆందోళనకారులు చేప‌ట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ప్రజల నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. టియర్ గ్యాస్‌ ను ప్రయోగించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళనకారులు ఆరోపించారు.

ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అధ్యక్షుడు గోటాబయ రాజపక్స దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌ జారీ చేశారు. పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ (చాప్టర్ 40)లోని సెక్షన్ 2 ద్వారా తనకు లభించిన అధికారాల ప్రకారం శ్రీలంక అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధిస్తూ గెజిట్‌ విడుదల చేశారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ గెజిట్‌ లో పేర్కొన్నారు.



కరోనా దెబ్బకు శ్రీలంక ఆర్దిక వ్యవస్థ దారుణగా దెబ్బ తింది. శ్రీలంక గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఆహారం కొరత,చమురు, నిరంతర విద్యుత్ కొతలు,పెరుగుతున్న ధరలతో లంకేయులు నరకం అనుభవిస్తున్నారు. వేలాది మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వలసబాటపడుతున్నారు. అయితే గొటబయ రాజపక్సే నేతృత్వంలోని ప్రభుత్వం శ్రీలంకలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేశాయి. దేశ పాలనలో స్థిరత్వం తెస్తానంటూ వాగ్దానాలు చేసిన రాజపక్స 2019లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అధికార పీఠం ఎక్కిన తర్వాత.. తక్కువ పన్ను రేట్ల వంటి అమలుకు సాధ్యం కాని అనేక హామీలను సర్కార్‌ అమలు చేసింది. వ్యాట్‌ను 15శాతం నుంచి 8 శాతానికి కుదించింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. నిధుల సమీకరణకు కీలకంగా ఉన్న నేషన్‌ బిల్డింగ్‌ ట్యాక్స్‌, పేయీ ట్యాక్స్‌, ఆర్థిక సేవల పన్నును పూర్తిగా రద్దు చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 33.5 శాతం మేర పడిపోయింది. చైనాకు మహీంద్ర మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఒకరకంగా ఆ దేశాన్ని కొంపముంచింది.

ALSO READ లంక అధ్యక్షుడి ఇంటి ముందు ఆందోళన కారుల బీభత్సం.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు పిలుపు..

ఇక, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు కొద్ది రోజుల క్రితం శ్రీలంక కు భారత్ చేయూతనిచ్చింది. జనవరిలో ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాం్ ఆఫ్ ఇండియాా)... శ్రీలంకకు 400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ వెసులు బాటును కల్పించింది. భారత్‌ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను ప్రకటించింది. మార్చి రెండోవారం నుంచి ఆ దేశానికి మన ఐఓసీ చమురును సరఫరా చేస్తోంది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి సైతం భారత్‌ మరో 1 బిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ ను ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Srilanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు