Home /News /international /

SRI LANKA CRISIS RANIL WICKREMESINGHE ELECTED AS THE NEW PRESIDENT OF SRI LANKA SK

Sri lanka | Ranil Wickremesinghe: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నిక

రణిల్ విక్రమసింఘే

రణిల్ విక్రమసింఘే

Sri lanka Crisis: రణిల్ విక్రమసింఘే అనుకూలంగా 134 ఓట్లు వచ్చాయి. SLPP నేత డల్లాస్ అలహపెరుమాకు 82 ఓట్లు పడ్డాయి. నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ నేత అనుర కుమార దిస్సనాయకేకు కేవలం మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి.

    ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న శ్రీలంక (Sri lanka) అధ్యక్షుడిగా ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) ఎన్నికయ్యారు. రణిల్‌ను తదుపరి అధ్యక్షుడిగా శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకుంది. లంక అధ్యక్షుడి పదవికి రణిల్ విక్రమ సింఘేతో పాటు డల్లాస్ అలహపెరుమా (Dullas alahaperuma), అనుర దిస్సనాయకే (Anura Dissanayake) పోటీ పడ్డారు. శ్రీలంక పార్లమెంట్‌లో మొత్తం  225 మంది సభ్యులున్నారు. రహస్య ఓటింగ్ పద్దతిలో ఎంపీలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవాీరం ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. తొలి ఓటును స్పీకర్‌ వేయగా, రెండో ఓటును రణిల్‌ విక్రమసింఘే వేశారు. మొత్తం 223 మంది ఓటు వేయగా.. ఇద్దరు ఎంపీలు ఓటు వేయలేదు. 223 ఓట్లలో 219 చెల్లుబాటైన ఓట్లు ఉన్నాయి. మిగతా నాలుగు ఇన్‌వాలిడ్ అని రిటర్నింగ్ అధికారులు తేల్చారు. అత్యధిక ఓట్లు రణిల్ విక్రమ సింఘేకు అనుకూలంగా పడడంతో.. ఆయన్ను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.



    రణిల్ విక్రమసింఘే అనుకూలంగా 134 ఓట్లు వచ్చాయి. SLPP నేత డల్లాస్ అలహపెరుమాకు 82 ఓట్లు పడ్డాయి. నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ నేత అనుర కుమార దిస్సనాయకేకు కేవలం మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. లంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్‌కు రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన శ్రీలంకకు ఆరుసార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. యునైటెడ్ నేషనల్ పార్టీ తరపున పార్లమెంటులో ఒకే ఒక ఎంపీగా ఆయన ఉన్నారు.  రణిల్ రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టు, న్యాయవాది కూడా పనిచేశారు. 1977లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా పార్లమెంటు సభ్యుడు అయ్యారు. 1993లో తొలిసారి ప్రధాని అయ్యారు.

    పారిశుద్ధ్య కార్మికులకు అక్కడ ఫుల్ డిమాండ్.. నెలకు రూ.8 లక్షల జీతం.

    త్రైపాక్షిక పోటీలో విజయం సాధించిన రణిల్ విక్రమసింఘే..  ఇప్పటికే పేదరికంలో ఉన్న దేశానికి నాయకత్వం వహిస్తారు. శ్రీలంకలో 2.2 కోట్ల మంది మంది ప్రజలు ఆహారం, ఇంధనం, మందుల కొరతను ఎదుర్కొంటున్నారు.  ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్నారు.  ఈ కష్టాల నుంచి లంకను గట్టెక్కించేందుకు.. అక్కడి ప్రభుత్వం  ఆర్థిక క బెయిలౌట్ ప్యాకేజీ కోసం IMFతో చర్చలు జరుపుతోంది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు రాజపక్స మిగిలిన పదవీకాలం వరకు.. అంటే  నవంబర్ 2024 వరకు పదవిలో కొనసాగుతారు.



    కాగా, శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికనై నేపథ్యంలో అధ్యక్ష భవనం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో వేలాది మంది ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలోకి చొరబడడంతో.. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు... పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Ranil Wickremesinghe, Sri Lanka, Sri Lanka Crisis, Sril

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు