ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక (Srilanka Crisis) విలవిల్లాడుతోంది. పాలకులు మారినా.. పరిస్థితుల్లో మార్పురావడం లేదు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం భారీ సంఖ్యలో ఆందోళనకారులు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స (Gotabaya Rajapaksa)అధికార నివాసాన్ని చుట్టుముట్టారు. నిరసనకారులు ఇంటిని ముట్టడించడంతో.. వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స ఇల్లు వదిలి పారిపోయారు. ఈ మేరకు శ్రీలంక రక్షణశాఖ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రజలు చాలా రోజులు ఆందోళనలు చేస్తున్నారు. ఐతే కొన్ని రోజులుగా పరిస్థితులు మాత్రం మెరుగుపడ్డాయి. కానీ మళ్లీ అకస్మాత్తుగా ఆందోళనలు పెరిగిపోయాయి. శనివారం కొలంబో (Colombo)లో పెద్ద ఎత్తున ఆందోళలనలకు ప్రభుత్వ వ్యతిరేకవ వర్గాలు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం పోలీస్ కర్ఫ్యూ విధించింది.
Putin Warning To Ukraine : ఉక్రెయిన్ ప్రజలకు ఇక విషాదమే..పుతిన్ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ ప్రావిన్స్‌లోని నెగోంబో, కెలానియా, నుగేగోడ, మౌంట్ లావినియా, నార్త్ కొలంబో, సౌత్ కొలంబో, కొలంబో సెంట్రల్‌లతో కూడిన ఏడు పోలీసు డివిజన్లలో కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులో ఉందని ప్రకటించారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిడి విక్రమరత్న పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలీసు కర్ఫ్యూ విధించిన ప్రాంతాలలో నివసించే ప్రజలు వారి ఇళ్లలోనే ఉండాలని, కర్ఫ్యూను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఐతే ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ ప్రత్యర్థులు, లాయర్లు, రైట్ గ్రూప్స్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాయి. పోలీస్ ఆర్డినెన్స్‌లో ఎక్కడా పోలీస్ కర్ఫ్యూ పదం లేదని.. కర్ఫ్యూ విధించడం చట్ట విరుద్ధమని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని మండిపడ్డాయి. ఇలా అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి.. కర్ఫ్యూని ఎత్తివేసింది. కర్ఫ్యూ ఎత్తివేశాక అసలు రచ్చ మొదలయింది. శనివారం ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసం వైపు వెళ్లారు. ఊహించని స్థాయిలో నిరసనకారులు తరలివచ్చి.. అధ్యక్షుడి నివాసాన్ని ముట్టడించడంతో... గత్యంతరం లేక రాజపక్స ఇల్లు విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆయన మిలటరీ క్యాంప్‌లోని రసహ్య ప్రాంతంలో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది.
Shinzo Abe Death: అందుకే షింబో అబేను షూట్ చేశా.. విచారణలో వెల్లడించిన నిందితుడు
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటి నుంచి పారిపోవడంతో.. ప్రధాని రణిల్ విక్రమసింఘే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో తాజా పరిస్థితిపై సమీక్షించి.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడి కార్యాలయంతో పాటు నివాసం కూడా ఆందోళనకారుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. లంకలో పరిస్థితులు అదుపు తప్పడంతో.. ప్రజల్లో మళ్లీ ఆందోళన నెలకొంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్తున్నారు. అక్రమంగా సముద్ర మార్గాల్లో భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో లంక తీరంలో కోస్ట్ గార్డ్ మళ్లీ గస్తీని పెంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International, International news, Sri Lanka, Srilanka